కల్కి ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలివే.. స్టార్ హీరో ప్రభాస్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడుగా!

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబో మూవీ కల్కి 2898 (kalki 2898) ఏడీ ఫస్ట్ డే కలెక్షన్లకు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 191.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.మేము ప్రేక్షకుల కోసం, సినిమాల మీద ప్రేమతో ఈ సినిమా తీశాం తప్ప రికార్డుల కోసం కాదని ఈ సినిమా నిర్మాత స్వప్న దత్ తెలిపారు.

 Kalki Movie First Day Collections Details Inside Goes Viral In Social Media ,ka-TeluguStop.com

కల్కి సినిమాతో ప్రభాస్ (Prabhas)బాక్సాఫీస్ ను షేక్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Kalki, Kalki Day, Nag Ashwin, Prabhas, Prabhas Day-Movie

200 కోట్ల రూపాయల రేంజ్ లో కల్కి సినిమాకు కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ పండితులు భావించగా వాళ్ల అంచనాలే దాదాపుగా నిజమయ్యాయని చెప్పవచ్చు.నాగ్ అశ్విన్(Nag Ashwin) ఒక క్రియేటివ్ జీనియస్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కల్కి సినిమా సాధిస్తున్న రికార్డ్స్ విషయంలో అభిమానులు సైతం సంతోషంగా ఉన్నారు.

నాగ్ అశ్విన్ క్రియేటివ్ జీనియస్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నాన్ సీజన్ లో విడుదలై కూడా ప్రేక్షకుల మెప్పు పొందడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కల్కి(kalki) సినిమాకు మరీ భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరగలేదు.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం జరగలేదు.

అయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదరగొట్టిందనే చెప్పాలి.ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.

Telugu Kalki, Kalki Day, Nag Ashwin, Prabhas, Prabhas Day-Movie

కల్కి మూవీ టికెట్ రేట్లు కొంతమేర తగ్గిస్తే బీ, సీ సెంటర్లలో ఈ సినిమా పరిస్థితి మరింత మెరుగవుతుందని చెప్పవచ్చు.కల్కి మూవీనే ఈ రేంజ్ లో ఉంటే కల్కి సీక్వెల్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే చర్చ సైతం జోరుగా జరుగుతోంది.ప్రభాస్ భవిష్యత్తు సినిమాలకు బిజినెస్ మరింత భారీ స్థాయిలో జరిగే ఛాన్స్ అయితే ఉంది.ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ సంతోషాన్ని కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube