టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జునకు( Nagarjuna ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.నాగార్జున వరుస విజయాలను సొంతం చేసుకుంటుండగా ప్రస్తుతం నాగ్ ఎక్కువగా స్పెషల్ రోల్స్ లో నటిస్తున్నారు.
స్టైలిష్ గా కనిపించడానికి ఇష్టపడే నాగార్జున లగ్జరీ లైఫ్ కు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry ) హీరోలు లెక్సెస్ కారుపై మోజు పడుతున్నారు.
మొన్నటివరకు టాలీవుడ్ సెలబ్రిటీలలో ఎక్కువమంది రేంజ్ రోవర్ పై ఆసక్తి చూపారు.నాగార్జున తాజాగా లెక్సెస్ హై ఎండ్ మోడల్ ( Lexus is a high end model )కారును కొనుగోలు చేయగా ఈ కారు ఖరీదు ఏకంగా 2 కోట్ల 80 లక్షల రూపాయలు ( 2 Crore 80 Lakh Rupees )అని సమాచారం అందుతోంది.
ఈ కారులో అత్యాధునిక ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.ఈ కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి.
ఆర్డీఏ ఆఫీస్ కు రిజిస్ట్రేషన్ కోసం నాగార్జున రావడంతో ఆయనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రామ్ చరణ్ కొంతకాలం క్రితమే ఇదే మోడల్ కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.గతంలో టయోటా వెల్ ఫైర్, రేంజ్ రోవర్( Toyota Well Fire, Range Rover ) ఎక్కువగా సెలబ్రిటీల కార్లుగా గుర్తింపును సొంతం చేసుకోగా ఇప్పుడు లెక్సెస్ హవా కొనసాగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నాగార్జున రెమ్యునరేషన్ ప్రస్తుతం 25 కోట్ల రూపాయల భారీ స్థాయిలో ఉంది.నాగార్జున బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.నాగార్జున క్రేజ్ మాత్రం మామూలుగా లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
త్వరలో అక్కినేని ఫ్యామిలీ ఇంట వరుస శుభకార్యాలు జరగనున్నాయి.నాగచైతన్య శోభితల పెళ్లి మరో ఆరు రోజుల్లో జరగనున్న సంగతి తెలిసిందే.
డిసెంబర్ నెల 4వ తేదీన చైతన్య శోభిత పెళ్లి జరగనుంది.చైతన్య క్రేజ్ మాత్రం వేరే లెవెల్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అఖిల్ పెళ్లి వచ్చే ఏడాది జరగనుందని సమాచారం అందుతోంది.