వయాగ్రా వలన వీర్యం యొక్క క్వాలిటి పెరుగుతుందా ?

ఎరక్టైల్ డిస్ఫంక్షన్ .తెలుగులో చెప్పాలంటే అంగం స్తంభించకపోవడం.

 Usage Of Viagra Will Increase Sperm Quality?-TeluguStop.com

ఈ సమస్యతో ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది పురుషులు బాధపడుతున్నారు.పురుషాంగంలో బలం లేక శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు.

ఇలాంటివారికోసమే వయాగ్రాని అందుబాటులోకి తెచ్చారని మనందరికి తెలిసిందే.కాని వయాగ్రాని వాడాలంటే చాలామంది మగవారు సంకోచిస్తారు.

ఎందుకంటే పురుషాంగం అంటే వీరికి మీసంతో సమానం.రెండిట్లో రోషం, పరువు దాచుకుంటారు మగవారు.

తమ మీసానికి, పురుషాంగానికి ఎలాంటి అవమానం జరక్కూడదు అని అనుకుంటారు.కాని ఆ ఈగోతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? సమస్య ఉన్నప్పుడు దాని చికిత్స గురించి ఆలోచిస్తే తప్పేముంది?

వయాగ్రా కేవలం అంగస్తంభనలు ప్రోత్సహించి, పురుషులు శృంగారంలో పాల్గొనేలా చేయడమే కాదు, వీర్యం యొక్క నాణ్యతను కూడా పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.ఇదే విషయాన్ని బ్రిటీష్ యూనివర్సిటీ ఆఫ్ క్లీనిజల్ ఫార్మోకోలోజి ధృవీకరించింది కూడా.

Phosphodiesterase Type 5 drugs, అంటే వయాగ్రా లాంటి మందులు పురుషుడి శరీరంలో సైక్లీక్ గినోసైన్ మొనోఫొస్ఫేట్ అనే కెమికల్ యొక్క ప్రభావాన్ని పెంచుతాయట.

దాంతో వీర్యం యొక్క బలం, నాణ్యత పెరుగుతాయని చెబుతున్నారు డాక్టర్లు.అయితే మీ వీర్యం ఇప్పటికే అరోగ్యంగా ఉంటే అది కొత్తగా చేసే సహాయం పెద్దగా ఏమి ఉండదట.

కాని బలహీనమైన వీర్యానికి మాత్రం వయాగ్రా లాభాలనిస్తుంది.కాని వయాగ్రా సొంత తెలివితేటలతో అస్సలు వాడకూడదు.

డాక్టర్ ఏ సమయంలో, ఎంత వాడమన్నాడో, అంతే వాడాలి.

వయాగ్రా వాడేముందు మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

ఇది సెక్స్ కోరికలను పెంచదు.కేవలం స్టామినా, స్తంభనలు పెంచేందుకు ఉపయోగపడుతుంది.

గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలు ఉన్నవారు వయాగ్రా వాడకపోవడమే మంచిది.మీరు ఇంకేదో సమస్య కోసం ఇంకేదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు, ఆ మెడిసిన్ గురించి కూడా డాక్టర్ కి పూర్తిగా చెప్పాలి.

అప్పుడే ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు వయాగ్రా వాడొచ్చో లేదో చెబుతారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు