వయసుకు తగ్గట్టుగా ఎత్తు పెరగకపోవడం.చాలా మంది పిల్లల్లో కనిపించే సమస్య ఇది.ఆహారపు అలవాట్లు, ఎదుగుదల నెమ్మదిగా ఉండటం, హార్మోన్ల లోపం, హైపర్ థైరాయిడ్, పోషకాల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల పిల్లల్లో ఈ సమస్య ఏర్పడుతుంది.దాంతో తల్లిదండ్రులు ఎంతగానో ఆందోళన చెందుతుంటారు.
ఈ క్రమంలోనే పిల్లలను హాస్పటల్స్ చుట్టూ తిప్పుతూ నానా పాట్లు పడుతుంటారు.అయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.
పిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎత్తు పెరిగేలా చేయవచ్చు.మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదట పిల్లల డైట్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.పాలు, పెరుగు, నెయ్యి, పనీర్ వంటివి పిల్లల డైలీ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే, పాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.ఇది ఎముకల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.
అలాగే పిల్లలకు వారానికి రెండు సార్లు చేపలు పెట్టాలి.చేపల్లో ఉండే విటిమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ పిల్లల ఎదుగుదలకు అద్భుతంగా సహాయపడతాయి.

పిల్లల డైలీ డైట్‌లో ఉడకబెట్టిన గుడ్డు, తాజా పండ్లు, నట్స్, ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి.ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్లకే పరిమితం అవుతున్నారు.కానీ, వారితో ఆటలు ఆడించాలి.ప్రతి రోజు కనీసం పది నిమిషాలు అయినా వ్యాయామం చేయించాలి.వీటి ద్వారా మీ పిల్లలు ఎత్తు పెరుగుతారు.
నిద్ర సరిగ్గా లేకపోయినా పిల్లలు సరిగ్గా ఎత్తు పెరగరు.
అందుకే రోజుకు పిల్లలు తప్పకుండా ఎనిమిది నుంచి పది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి.చాలా మంది పిల్లలు కూల్ డ్రింక్స్, కాఫీ, టీలకు అలవాటు పడుతుంటారు.
కానీ, వీటిలో ఉండే కెఫిన్ పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.కాబట్టి, ఇలాంటి వాటికి పిల్లలు దూరంగా ఉండేలా చూసుకోవాలి.