అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా.? పొట్ట వద్ద కొవ్వు బాగా పేరుకుపోయిందా.? బరువు తగ్గాలని భావిస్తున్నారా.? పొట్టను నాజూగ్గా మార్చుకోవాలని తపన పడుతున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ జ్యూస్ ను రోజు మార్నింగ్ తాగితే వెయిట్ లాస్ తో సహా మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు ఆ జ్యూస్ వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? వంటి విషయాలను తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒకకీర దోసకాయ( Cucumber ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.అలాగే ఒక దానిమ్మ పండును తీసుకుని తొక్క తొలగించి గింజలను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు, దానిమ్మ గింజలు, నాలుగు ఫ్రెష్ పుదీనా ఆకులు, అర కప్పు సీడ్ లెస్ బ్లాక్ గ్రేప్స్( Black Grapes ) వేసుకోవాలి.చివరిగా ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తద్వారా మన జ్యూస్ రెడీ అవుతుంది.

ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఈ కీరా దానిమ్మ గ్రేప్ జ్యూస్ తీసుకోవాలి.ఈ జ్యూస్ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా ఈ జ్యూస్ వెయిట్ లాస్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.
నిత్యం ఈ జ్యూస్ ను సేవిస్తే మెటబాలిజం రేటు( Metabolism ) ఇంప్రూవ్ అవుతుంది.దాంతో క్యాలరీలు కరిగే వేగం పెరిగి త్వరగా బరువు తగ్గుతారు.అదే సమయంలో పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.బాన పొట్ట కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారుతుంది.

అలాగే ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.మూత్రపిండాలు హెల్తీ గా క్లీన్ గా మారతాయి.ఇటీవల రోజుల్లో ఎంతో మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.అయితే ఈ జ్యూస్ ను నిత్యం తాగడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఐరన్ కంటెంట్ లభిస్తుంది.దీంతో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత దూరం అవుతుంది.