సాధారణంగా ఉదయం లేవగానే దాదాపు అందరూ చేసే పని ఏ టీనో, కాఫీనో పొట్టలోకి పోసేయడం.కానీ, ఖాళీ కడుపున టీ, కాఫీలు తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు మందగించడం, తినే ఆహారం నుండి పోషకాలను గ్రహించే శక్తిని శరీరం కోల్పోవడం, గ్యాస్ తదితర సమస్యలు ఏర్పడతాయి.అందుకే ఉదయాన్నే టీ, కాఫీలు కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే పానియాలు తీసుకోవాలి.
అటువంటి వాటిలో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు పాలు హెల్త్‌కు బోలెడన్ని బెనిఫిట్స్ అందించే బెస్ట్ మార్నింగ్ డ్రింక్ అని చెప్పాలి.
అవును, ఉదయం పూట పసుపు పాలు తీసుకుంటే నీరసం, అలసట, వికారం వంటి సమస్యలు దూరమై బాడీకి ఫుల్ ఎనర్జీ లభిస్తుంది.మరియు ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బలపడుతుంది.

అలాగే ఉదయం నిద్ర లేవగానే మజ్జిగ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం.అవును, టీ లేదా కాఫీ తీసుకునే బదులు ఒక గ్లాస్ పల్చటి మజ్జిగ తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.మరియు నీరసం, తల నొప్పి వంటివి మార్నింగ్ తీసుకోవాల్సిన బెస్ట్ డ్రింక్స్‌లో లెమన్ వాటర్ ఒకటి.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో ఒక స్పూన్ నిమ్మ రసం, ఒక స్పూన్ తేనె కలుపుకుని సేవించాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే మైండ్ రిఫ్రెష్ అవ్వడంతో పాటు వెయిట్ లాస్ అవుతుంది.

గ్రీన్ టీ హెల్త్‌కి ది బెస్ట్ టీ అని చెప్పుకోవచ్చు.ఉదయం పూట టీ, కాఫీలు తాగడం కంటే ఒక కప్పు గ్రీన్ టీని సేవిస్తే ఎంతో మంచిది.కేవలం బరువు తగ్గడానికే కాదు గుండె ఆరోగ్యానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ఒత్తడి, డిప్రెషన్ వంటి సమస్యలు దరి చేరకుండా అడ్డుకట్ట వేయడానికి ఇలా ఎన్నో అవసరాలకు గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.
ఇక మార్నింగ్ కొబ్బరి నీటిని సైతం తీసుకోవచ్చు.ఇన్‌స్టెంట్ ఎనర్జీని అందించి శరీరాన్ని ఉత్సాహంగా మార్చడంలో కొబ్బరి నీరు ఉపయోగపడతాయి.అలాగే కొబ్బరి నీరు తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌నూ పొందొచ్చు.