ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) చిన్న సినిమాలు ఒక లెక్క ఇప్పటినుంచి ఆయన చేయబోయే సినిమాలు మరొక లెక్క అనే విధంగా తన స్ట్రాటజీ మొత్తాన్ని మార్చుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఆయన దేవర సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం భారీ కలెక్షన్లను తీసుకురాలేకపోయాడు.
అందువల్లే ప్రశాంత్ నీల్( Prashanth Neil ) తో చేస్తున్న సినిమా కోసం విపరీతమైన కసరత్తులైతే చేస్తున్నాడు.ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత నీల్ సినిమాతో 1500 కోట్ల కలెక్షన్లు రాబట్టి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఉన్నాడు.
ఇక బాలీవుడ్ హీరోలతో పాటు ఆయన మల్టీ స్టారర్ సినిమాలను ( Multi starrer movies )చేస్తూనే తన మార్కెట్ ను కూడా భారీ పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటేనే తప్ప లేకపోతే ఇప్పుడు వస్తున్న హీరోలందరూ అతన్ని బీట్ చేసి ముందుకు దూసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలావరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ప్రశాంత్ నీల్ మీదనే పూర్తి భారం వేసి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్( Lokesh Kanakaraj ) డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయం తెలీదు గానీ మొత్తానికైతే ఎన్టీఆర్ వరుసగా ప్లాన్ ఇండియా డైరెక్టర్లను ఎంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక వరుస సినిమాలతో సూపర్ సక్సెs లను అందుకుంటే పాన్ ఇండియాలో ఆయన స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా నెంబర్ వన్ పొజిషన్ కి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి.