టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జక్కన్న(Jakkanna) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ గా నిలవడంతో పాటు ఒకదానిని మించి ఒకటి రికార్డుల మోత మోగించాయి.ఆ సంగతి పక్కన పెడితే ఇప్పటి వరకు రాజమౌళిని (Rajamouli)తలదన్నేలా ఏ దర్శకనిర్మాత కానీ ఏ హీరో కానీ ప్లాన్ చేయలేకపోయారు.
ప్రభాస్, ఎన్టీఆర్ (Prabhas, NTR)ఇలా ఎవ్వరూ రాజమౌళిలా తమ సినిమాలను ప్రమోట్ చేయలేకపోయారు.కానీ ఇప్పుడు రాజమౌళిలా అల్లు అర్జున్(Allu Arjun) చేస్తున్నాడు.పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉందా, లేదా అనేది పక్కనపెడితే ఆయన పుష్ప 2 ద రూల్(Pushpa 2 The Rule) ని ప్రమోషన్స్ చేస్తున్న హడావిడి చూస్తే పుష్ప 2(Pushpa 2) కి భారీ ఓపెనింగ్స్ పక్కా అనిపిస్తోంది.అయితే గతంలో రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లను వెంటేసుకుని పలు సిటీస్ లో ఆర్ఆర్ఆర్ మూవి ని ప్రమోట్ చేయగా అది బాగా వర్కౌట్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అల్లు అర్జున్ తన సైన్యం సుకుమార్, దేవిశ్రీ, ఇంకా ముఖ్య నటులు లేకుండా రష్మికతో కలిసి సుడిగాలిలా పుష్ప2 భారీ ఈవెంట్స్ తో పాట్నా మొదలు కొచ్చి వరకు తన క్రేజ్ చూపిస్తున్నాడు.
ఎక్కడికి వెళ్లినా అల్లు అర్జున్ కి అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు.అయితే ఇటీవల జరిగిన పాట్నా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెన్నై ఈవెంట్ లో ఈ రోజు కొచ్చి ఇలా ప్రతి పుష్ప ఈవెంట్ లో అల్లు అర్జున్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు.విడుదల తేదీకి మరి కొద్ది రోజులే ఉండడంతో సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు అల్లు అర్జున్.
అయితే ఇప్పుడు బన్నీ రాజమౌళి లాగా సినిమా ప్రమోషన్స్ చేయడం పట్ల రకరకాలుగా స్పందిస్తున్నారు.