తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8(bigg boss8) రసవత్తరంగా సాగుతోంది.చూస్తుండగానే అప్పుడే ముగింపు దశకు చేరుకుంటోంది.
ఇకపోతే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఏమేమి జరిగాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.టికెట్ టు ఫినాలే కోసం హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించేందుకు మానస్, ప్రియాంక జైన్(Manas, Priyanka Jain) బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు.
వీళ్లు ప్రేరణ, నబీల్ను గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేశారు.అయితే ఈ రోజు బ్రెయిన్ గేమ్‌లో నలుగురు ఆడే ఛాన్స్ ఉందంటూ మరో ఇద్దర్ని ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్.
దీంతో ప్రేరణ, నబీల్.ఐక్యూ అంతగా లేదు, బ్రెయిన్ గేమ్ ఆడలేరంటూ అవినాష్, పృథ్వీని సెలక్ట్ చేశారు.

అలా ఈ నలుగురికి సుడోకు గేమ్ ఇచ్చాడు.ఈ గేమ్‌లో ముందుగా నబీల్ గంట కొట్టి గెలిచేసినంత బిల్డప్ ఇచ్చాడు.ఏ ఒక్కరూ సుడోకు పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ క్లూ ఇచ్చాడు.ఆ క్లూ అందుకుని అవినాష్ చకచకా సుడోకు పూర్తి చేసి గంట కొట్టాడు.తర్వాత ప్రేరణ, పృథ్వీ, నబీల్ గేమ్ కంప్లీట్ చేశారు.వీళ్లందరికీ బిగ్‌బాస్ కొన్ని మూటలు ఇచ్చాడు.
అందులో అవినాష్‌కు 8 బాల్స్, ప్రేరణకు 6, పృథ్వీకి 5, నబీల్‌కు 4 (Avinash has 8 balls, Prerna has 6, Prithvi has 5, Nabeel has 4)బంతులు ఉన్నాయి.చివర్లో విష్ణు, మానస్ కలిసి జరీజరీ పంచె కట్టి పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు.
మాజీ బాయ్‌ఫ్రెండ్ గుర్తురావడంతో అర్ధరాత్రి పృథ్వీ పక్కన చేరి ముచ్చట్లు పెట్టింది విష్ణు.

తనకు కలలో తనకు మాజీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడంది.బ్రేకప్ నువ్వు చెప్పావా? అని పృథ్వీ అడగ్గా.అవును, నేనే బ్రేకప్ చెప్పాను అని తెలిపింది.
తెలీకుండా రెండు తప్పులు చేశాడు.నా మంచి కోసమే చేశాడు.
నాకు తెలిస్తే భరించలేనని చెప్పలేదు.తీరా తెలిశాక నేను నిజంగా భరించలేకపోయాను.
నాకోసమే కొన్ని పనులు చేసినా అవి నాకస్సలు నచ్చలేదు.అవి నా ముఖంపై చెప్పేంత ధైర్యం లేని వ్యక్తితో ఉండకూడదనుకున్నాను, బ్రేకప్ చెప్పాను.
కానీ అతడికి నా తల్లి స్థానమిచ్చాను.కాబట్టి తనను చూడకుండా ఉండలేకపోతున్నాను.
అతడు నా బలం.తనను హత్తుకుంటే మా అమ్మను హత్తుకున్నట్లే ఉంటుంది.నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు.అమ్మలాగా స్వచ్ఛంగా ప్రేమించాడు అంటూ అతడి జ్ఞాపకాలను పృథ్వీతో పంచుకుంది.కానీ ఆమె ప్రియుడు ఎవరు అన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.