లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఓ భారతీయ విద్యార్ధిని కెనడాలోని గ్రేటర్ టొరంటో ఏరియా( Greater Toronto Area, Canada ) (జీటీఏ) పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన వ్యక్తిని బ్రాంప్టన్ నివాసి 22 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్‌గా( Arshdeep Singh ) గుర్తించారు.
పీల్ రీజినల్ పోలీసులు (పీఆర్పీ) ప్రకారం.సింగ్ తన వాహనంలో రైడ్ షేర్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
బాధితులు కూడా భారత సంతతికి చెందినవారుగానే పోలీసులు అనుమానిస్తున్నారు.ఇతను పంజాబీలోనే వారితో మాట్లాడాడని తెలిపారు.
అతని చేతుల్లో ముగ్గురు మహిళలు లైంగిక వేధింపులకు గురైనట్లుగా తెలుస్తోంది.
తొలి సంఘటన నవంబర్ 8న ఉదయం 7 గంటలకు జరిగింది.బ్రాంప్టన్‌లో ఓ బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న మహిళ వద్దకు తన బ్లాక్ ఫోర్ డోర్ సెడాన్‌ను నడుపుతూ వెళ్లిన అర్ష్‌దీప్ సింగ్ రైడ్ షేర్ ఆపరేటర్‌గా పరిచయం చేసుకుని ఆమెను ఎక్కించుకున్నాడు.అనంతరం వాఘన్ పట్ణణంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.45 నిమిషాలు గడిచేలోగా బ్రాంప్టన్‌లోని బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న మరో మహిళతోనూ ఇదే రకంగా వ్యవహరించాడు.తర్వాత నవంబర్ 16న ఉదయం 6.45 గంటలకు మూడో మహిళతోనూ ఇదే రకంగా వ్యవహరించాడు.
ఈ ఘటనలు ఒక్కడే చేశాడని అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు.మూడు ఘటనల్లోనూ నిందితుడు బాధితులతో పంజాబీలోనే మాట్లాడినట్లు తెలుసుకున్నారు.కిడ్నాప్, లైంగిక వేధింపులు, ఆయుధంతో బెదిరింపులు, దోపిడీ సహా పలు అభియోగాలను అతనిపై నమోదు చేశారు.
స్థానిక మీడియా కథనం ప్రకారం.అర్ష్‌దీప్ సింగ్ 2022లో అంతర్జాతీయ విద్యార్ధిగా కెనడాకు వచ్చాడు.
అపరిచితులు లిఫ్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవద్దని పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ జనం పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ తరహా నేరాలు జరుగుతున్నాయి.నిందితుడిని అదుపులో తీసుకునేందుకు 24 గంటలూ శ్రమించిన పరిశోధకుల బృందాన్ని పీఆర్పీ డిప్యూటీ చీఫ్ నిక్ మిలినోవిచ్ అభినందించారు.
లైంగిక వేధింపులను అడ్డుకోవడానికి, బాధితులకు అండగా నిలిచేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు.