హెయిర్ ఫాల్,( Hairfall ) డాండ్రఫ్.( Dandruff ) ఇవి రెండు మనల్ని అత్యంత కామన్ గా వేధించే సమస్యలు.వీటిని వదిలించుకునేందుకు చేయని ప్రయత్నం ఉండదు.ఖరీదైన కేశ ఉత్పత్తులను వాడుతుంటారు.అయినా సరే ఫలితం ఉండటం లేదా.డోంట్ వర్రీ ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ టానిక్ తో హెయిర్ ఫాల్, డాండ్రఫ్ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న ఉల్లిపాయను( Onion ) తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలను( Ginger ) కూడా తీసుకుని పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి( Coffee Powder ) కూడా వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.
దాంతో మన హెయిర్ టానిక్( Hair Tonic ) అనేది రెడీ అవుతుంది.
స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో టానిక్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు టానిక్ ను స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను కనుక వాడితే చుండ్రు దెబ్బకు పరారవుతుంది.అలాగే ఈ టానిక్ జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది.జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.అంతే కాకుండా ఈ టానిక్ కురులను షైనీగా మెరిపిస్తుంది.
తెల్ల జుట్టు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.జుట్టు ఒత్తుగా ఎదిగేలా సైతం ప్రోత్సహిస్తుంది.