పెళ్లి తేదీ గురించి క్లారిటీ ఇచ్చేసిన కీర్తి సురేష్.. అక్కడే పెళ్లి చేసుకుంటానంటూ?

గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్( Keerthy Suresh ) పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.ఈమె పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.

 Keerthy Suresh And Her Family Visits Tirumala, Tirumala, Keerthy Suresh, Tollywo-TeluguStop.com

ఈమె పెళ్లి ముహూర్తం కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యింది.వచ్చే నెలలో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది కీర్తి సురేష్.

ఈ మేరకు ఆమె శుక్రవారం స్వయంగా వెల్లడించారు.ఇది ఇలా ఉంటే కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని( Tirumala Srivaru ) దర్శించుకున్నారు.

Telugu Keerthy Suresh, Keerthysuresh, Tirumala, Tirumala Temple, Tollywood-Movie

స్వామి వారి సేవలో పాల్గొన్నారు.దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా పెళ్లి ముచ్చట బయటపెట్టారు.వచ్చే నెలలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు.గోవాలో( Goa ) వెడ్డింగ్‌ జరుగుతుందని అన్నారు.

ఇక తాను నటిస్తున్న హిందీ సినిమా కూడా వచ్చే నెలలో విడుదల కానుందని, అందుకే స్వామివారి దర్శనం కోసం వచ్చానని తెలిపారు.బేబీ జాన్‌ షూట్‌ పనుల్లో కీర్తి సురేశ్‌ ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

Telugu Keerthy Suresh, Keerthysuresh, Tirumala, Tirumala Temple, Tollywood-Movie

ఈ సినిమాతో ఆమె బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.వరుణ్‌ ధావన్‌ హీరోగా ఇది తెరకెక్కుతోంది.కోలీవుడ్‌లో విడుదలైన తెరీ రీమేక్‌గా ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.మరోవైపు కీర్తి సురేశ్‌ ఇటీవల తన రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.తన స్నేహితుడు ఆంటోనీతో( Antony ) ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు.

ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube