ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

ఈరోజుల్లో చాలామంది డ్రైవింగ్ రాకపోయినా వాహనాలు కొనుగోలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు.లైసెన్సు, డ్రైవింగ్ సెన్స్ లేకుండా తమ ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రిస్కులో పడేస్తున్నారు.

 Biker Walks Casually After Surviving A Big Accident Video Viral Details, Viral V-TeluguStop.com

ఇలాంటి బాధ్యతారాహిత్యమైన కారు డ్రైవర్లు, బైక్ రైడర్స్ చేసే యాక్సిడెంట్ల వీడియోలు( Accident Videos ) తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి.వాటిని చూస్తే చాలా ఆందోళన కలుగుతుంది.

అయితే ఇటీవల మాత్రం ఒక ఫన్నీ యాక్సిడెంట్ వీడియో వైరల్ గా మారింది.నెటిజన్లు ఆ వీడియో చూసి నవ్వుకుంటున్నారు.

నిజానికి ఇది ఒక పెద్ద యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు.చాలా సీరియస్ గా పరిగణించవచ్చు.

అయితే ఈ యాక్సిడెంట్ కి గురైన బైకర్‌కి( Biker ) ఏం కాలేదు.

అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక బిజీ రోడ్డుపై వాహనాలు వేగంగా వెళుతున్నట్లుగా కనిపిస్తుంది.అంతలోనే కుడి వైపు నుంచి ఒక బైకర్ చాలా వేగంగా వస్తూ కనిపిస్తాడు.

అయితే అతను తాగి ఉన్నాడా లేదంటే ఆ వేగంలో బండిని కంట్రోల్ చేయలేకపోయాడో తెలియదు కానీ మధ్యలో ఉన్న ఒక డివైడర్( Divider ) లాంటి ప్రాంతాన్ని ఢీకొట్టాడు.దాంతో ఒక్కసారిగా ఎగిరి ఆపోజిట్ సైడ్ లో వస్తున్న ఫోర్ వీలర్ ముందు భాగంలో పడ్డాడు.

టూవీలర్ నుంచి ఎగిరి అతను అలా పడిపోవడంతో చచ్చిపోయే ఉంటాడని అందరూ అనుకున్నారు.

నిజానికి ఇంత స్పీడ్ తో కిందపడిన వారు ఎవరైనా సరే తల పగిలి చనిపోతారు కానీ ఈ భూమ్మీద ఇంకా ఎక్కువ రోజులు బతకాలని అతనికి రాసిపెట్టినట్లుంది.అందుకే ఇంత పెద్ద ప్రమాదం నుంచి అతడు బయటపడ్డాడు.కాలుకు చిన్న గాయం అయింది.

కొద్దిగా కుంటుతూ తర్వాత చాలా క్యాజువల్ గా అతను తన బండి దగ్గరికి వెళ్ళాడు.సాధారణంగా అంత పెద్ద యాక్సిడెంట్ అయితే మైండ్ బ్లాక్ అవుతుంది.

ఎటు కదలలేరు కూడా.అయినా ఇతను మాత్రం ఏమీ జరగనట్లు ప్రవర్తించాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.“ఏంది భయ్యో, నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?” సరదాగా ప్రశ్నిస్తున్నారు ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube