ప్రస్తుత చలికాలంలో( Winter ) చాలా మందికి బాగా కఫం పట్టేస్తుంటుంది.కఫం( Phlegm ) అనేది శ్వాసకోశ వ్యవస్థ నుంచి ఉత్పత్తి అయ్యే శ్లేష్మం.
కఫం కారణంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక తదితర సమస్యలు తలెత్తుతాయి.ఈ క్రమంలోనే కఫాన్ని కరిగించుకునేందుకు కొందరు మందులు వాడుతుంటారు.
కానీ వంటింట్లో కఫాన్ని కరిగించే ఔషధాలు ఎన్నో ఉన్నాయి.అందులో లవంగాలు( Cloves ) కూడా ఒకటి.
ఘాటైన రుచిని కలిగి ఉండే లవంగాలు కఫాన్ని తొందరగా విరిచేస్తాయి.మరి అందుకోసం లవంగాలను ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక ఐదు లవంగాలను కచ్చాపచ్చాగా దంచి అందులో వేసుకోవాలి.
అలాగే అర టీ స్పూన్ అల్లం తురుము,( Ginger ) అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వేసి మరిగించాలి.దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగిస్తే మంచి లవంగం టీ రెడీ అవుతుంది.
ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఈ లవంగం టీలో కొంచెం తేనె కలుపుకొని ఒక కప్పు చొప్పున తీసుకుంటే మంచి లాభాలు పొందుతారు.
ముఖ్యంగా ఈ లవంగం టీ( Cloves Tea ) కఫాన్ని విరిచేస్తుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను తొలగిస్తుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలను తరిమికొడుతుంది.
లవంగం టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
అలాగే లవంగం టీలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి.ఇవి నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టడమే కాకుండా మొత్తం నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అంతేకాదండోయ్, లవంగం టీ కాలేయ పని తీరును పెంచడంలో సహాయపడుతుంది మరియు కాలేయ సిర్రోసిస్, కొవ్వు కాలేయ వ్యాధి సంకేతాలను తగ్గిస్తుంది.లవంగం టీ జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంపొందిస్తుంది.తద్వారా అజీర్ణం, ఉబ్బరం మరియు గ్యాస్ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.