బ్యాటింగ్ చేస్తూ గుండెపోటు.. నిమిషాల్లో మరణించిన క్రికెటర్.. వీడియో వైరల్..

ఈరోజుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసు వర్గాల వారికి గుండెపోట్లు( Heart Attack ) వస్తున్నాయి.సడన్‌గా హార్ట్ అటాక్ రావడం, ఆపై వారు చనిపోవడం జరుగుతోంది.

 Cricketer Suffers Chest Pain During Batting And Dies In Pune Video Viral Details-TeluguStop.com

ఫిజికల్ గా ఫిట్ ఉన్న వారిని కూడా ఈ హార్ట్ అటాక్స్‌ బలి తీసుకుంటున్నాయి.తాజాగా పుణేలోని( Pune ) గార్వేర్ స్టేడియంలో( Garware Stadium ) 35 ఏళ్ల క్రికెటర్ గుండెపోటుతో కుప్పకూలి మరణించారు.

స్థానిక క్రికెట్ మ్యాచ్‌ సాగుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.మృతుడి పేరు ఇమ్రాన్ పటేల్.

( Imran Patel ) ఈ ప్లేయర్ ఓపెనర్ గా బ్యాటింగ్‌కు దిగారు.ఆయన బ్యాటింగ్ చేస్తుండగా గుండెలో నొప్పి మొదలైంది.

దాంతో ఆట ఆపి డగవుట్‌కు వెళ్లారు.కొన్ని నిమిషాల్లోనే ఇమ్రాన్‌ కుప్పకూలిపోయారు.

జట్టుతోటి ఆటగాళ్లు, ఇతరులు ఆయనకు సహాయం చేయడానికి పరుగులు తీశారు.ఇమ్రాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు కానీ వైద్యులు కాపాడలేకపోయారు.

క్రికెట్ మ్యాచ్‌ను( Cricket Match ) ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.ఈ సంఘటన మొత్తం కెమెరాలో రికార్డు అయింది.అతడికి హార్ట్ ఎటాక్ వచ్చిన వీడియో క్లిప్ తీసి మీడియాలో పెట్టారు.అది కాస్త వైరల్ అయింది.ఆ వీడియోలో, ఇమ్రాన్ పటేల్ తన ఇన్నింగ్స్‌ను ముందే ముగించి, తన జట్టుతో మాట్లాడుతూ డగ్‌అవుట్‌కు వెళుతున్నట్లు కనిపిస్తుంది.కొద్దిసేపటికి, ఆయన కుప్పకూలిపోయినప్పుడు జట్టుతోటి ఆటగాళ్లు ఆయన్ని సహాయం చేయడానికి పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇమ్రాన్ స్థానిక క్రికెట్ సర్కిల్ లో బాగా పరిచయమైన క్రికెటర్.ఆయన ఆల్‌రౌండర్‌గా అద్భుతంగా ఆడుతూ ఈ టోర్నమెంట్‌లో బాగా రాణిస్తున్నారు.ఆయన ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కు గురి చేసింది.ఈ సంఘటన జరిగిన సమయంలో మైదానంలో ఉన్న కోప్లేయర్ నజీర్ ఖాన్ మాట్లాడుతూ “ఇమ్రాన్ చాలా ఫిట్‌గా ఉండేవాడు, ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు.

అతను ఉన్నట్టుండి మరణించడం చూసి పూర్తిగా షాక్‌లో ఉన్నాం” అని అన్నారు.

క్రికెట్‌తో పాటు, ఇమ్రాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా చురుకుగా ఉండేవారు.

ఆయన ఒక క్రికెట్ క్లబ్‌ను కూడా కలిగి ఉన్నారు.ఇంత మంచి భవిష్యత్తు హఠాత్తుగా మరణించడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు విచారంలో మునిగిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube