టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్1 హీరోలజాబితాలో ప్రధానంగా పవన్, మహేష్, తారక్, చరణ్, బన్నీ, ప్రభాస్ పేర్లు ఉంటాయి.ఈ హీరోలందరి డైలాగ్ డెలివరీ ఎంతో బాగుంటుంది.
అయితే ఈ హీరోలలో డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు తారక్ పేరు జవాబుగా వినిపిస్తోంది.ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం ఈ విషయాన్ని మాత్రం అంగీకరిస్తున్నారు.
తారక్ డైలాగ్ డెలివరీ( NTR Dialogue Delivery ) ఇతర హీరోలకు భిన్నంగా ఉంటుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) వార్2 మూవీ( War 2 ) షూటింగ్ ను సైతం శరవేగంగా పూర్తి చేస్తున్నారు.వార్2 సినిమా క్లైమాక్స్ షూట్ డిసెంబర్ లో జరగనుందని తెలుస్తోంది.దాదాపుగా 20 రోజుల పాటు ఈ యాక్షన్ సీన్ ను షూట్ చేయనున్నారని హృతిక్, తారక్ కాంబోలో వచ్చే ఫైట్ సీన్ వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని గ్రేట్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరని చెప్పడంలో సందేహం అవసరం లేదు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతుండగా స్టార్ డైరెక్టర్లు ఈ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు.
పాన్ ఇండియా డైరెక్టర్లకు తారక్ ఎక్కువగా ఓటేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లకు తారక్ ఓటేస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తుండటం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓటేస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో చరిత్ర సృష్టిస్తాయో చూడాల్సి ఉంది.