ప్రముఖ భారతీయ యూట్యూబర్ ఇషాన్ శర్మ( Youtuber Ishan Sharma ) తాజాగా శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని( San Francisco ) భయంకరమైన పరిస్థితులను బయటపెట్టారు.ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, అమెరికన్ సిటీ రోడ్లపై వ్యక్తులు పడుకుని, నిరాశ్రయులైన స్థితిలో( Homeless ) ఉన్నట్లు కనిపించింది.
ఈ దృశ్యాలను చూసి ఆయన శాన్‌ఫ్రాన్సిస్కో నగరం ఎంతో అసురక్షితమైనదిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇషాన్ శర్మ తన వీడియోలో ఒక వ్యక్తి రోడ్డుపై పడి ఉండి, కూర్చోలేని స్థితిలో ఉన్న దృశ్యాన్ని చూపించారు.
ఇది శాన్‌ఫ్రాన్సిస్కోలోని నిరాశ్రయత, అసుక్షిత పరిస్థితులకు నిదర్శనమని ఆయన వాదించారు.ఇషాన్ తన పోస్ట్‌లో, “శాన్‌ఫ్రాన్సిస్కో అంటే అమెరికా టెక్నాలజీ కాపిటల్. ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యక్తులు, అతిపెద్ద టెక్ కంపెనీలు ఇక్కడే ఉన్నాయి.కానీ, ఇక్కడి రోడ్లన్నీ అర్ధాంతరంగా నిరాశ్రయులతో నిండిపోయాయి.
వీరిలో చాలామంది మానసిక అస్వస్థతతో బాధపడుతున్నారు, మత్తుపదార్థాలకు అలవాటు పడ్డారు.ఇక్కడ గన్ వైలెన్స్, కార్లను పగలగొట్టడం చాలా సాధారణం.
దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.రోడ్లన్నీ జాంబీలలా( Zombies ) కనిపించే వ్యక్తులతో నిండిపోయాయి.
” అని రాశారు.
శర్మ ఈ సమస్యలను ఎవరూ ఎందుకు పరిష్కరించడం లేదో ప్రశ్నిస్తూ, “శాన్‌ఫ్రాన్సిస్కో ఇప్పుడు ఇలా ఎందుకు మారింది? ఇలాంటి పరిస్థితులను ఎందుకు సరిచేయలేకపోతున్నారు?” అని అసహనం వ్యక్తం చేశారు.ఆయన పోస్ట్‌కు 20,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చి వైరల్ అయింది.ఇన్నోవేషన్ కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఇలాంటి సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయనే చర్చ ఈ పోస్ట్‌తో మళ్లీ మొదలైంది.
ఒక యూజర్ కామెంట్ చేస్తూ “శాన్‌ఫ్రాన్సిస్కో ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం అదుపు లేని మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం నిర్లక్ష్యం.ఈ సమస్యలను పరిష్కరించాలంటే టెక్నాలజీ మాత్రమే సరిపోదు, ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలి, సమాజానికి పెట్టుబడులు పెట్టాలి, మానవతా దృక్పథంతో పని చేయాల”ని అన్నారు.మరొక వ్యక్తి పశ్చిమ దేశాల వైఖరిని విమర్శిస్తూ, “పశ్చిమ దేశాల వారు ఎప్పుడూ భారతదేశాన్ని విమర్శిస్తూ ఉంటారు.ఇప్పుడు వారు తమను తాము పరిశీలించుకోవడానికి ఇదో మంచి అవకాశం” అని అన్నారు.