మోనాలిసా భారతీయ మహిళ అయితే ఎలా ఉంటుందో చూశారా.. ఇమేజ్ ఇదిగో!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కళా రంగంలో కొత్త విప్లవం సృష్టిస్తోంది.ఆర్టిస్టులు ఇప్పుడు AI సాధనాల సాయంతో తమ ఊహలకు పదును పెట్టి, మునుపెన్నడూ చూడని అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నారు.

 Delhi University Student Creates Indian Version Of Mona Lisa Using Ai Pic Viral-TeluguStop.com

ఈ క్రమంలో, ఢిల్లీ యూనివర్సిటీకి( Delhi University ) చెందిన ఒక విద్యార్థిని లియోనార్డో డా విన్సీ గీసిన మోనా లిసాకు( Mona Lisa ) ఇండియన్ టచ్ అందించి ఆశ్చర్యం కలిగించారు.ఈ కొత్త చిత్రంలో, మోనా లిసా సంప్రదాయ భారతీయ దుస్తులు( Indian Costume ) ధరించి, తలపై దుపట్టా అందంగా చుట్టుకుని ఉన్నట్లుగా కనిపించింది.

ఆమెను మంగళ సూత్రం, చెవి దిద్దులు, అందమైన నెక్లెస్ వంటి భారతీయ ఆభరణాలతో ఆర్టిస్టు అందంగా అలంకరించారు.ఈ డీటెయిల్స్‌తో ఆమెకు ఒక ప్రత్యేకమైన భారతీయ అందాన్ని అందించారు.

మోనాలిసా ఇండియన్ లుక్ లో కనిపించడం చాలామందికి నచ్చేసింది.

ఈ చిత్రాన్ని రూపొందించిన ఆర్టిస్ట్ పేరు రాశి పాండే.( Rashi Pandey ) ఆమె తాను కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన భారతీయ మోనా లిసా( Indian Mona Lisa ) చిత్రాన్ని X (ట్విట్టర్) వేదికగా పంచుకుని, ఆ చిత్రానికి పేరు సూచించాలని కోరారు.ఆమె చిత్రంతో పాటు “నేను మోనా లిసా భారతీయ వెర్షన్‌ను AI సాయంతో తయారు చేశాను.” అని రాశారు.

ఆమె పోస్ట్ వైరల్‌గా మారగా, నెటిజన్లు ఆమెకు క్రియేటివ్, ఫన్నీ నేమ్స్ సూచించారు.కొందరు ఆమెను “షోనా లిసా”, “మోనా తాయి”, “లిసా బెన్” అని పిలిచారు.మరికొందరు ఆమెను భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళగా ఊహించారు.

ఒక నెటిజన్ ఆమెకు బిందీ వేసి “మోనా లిసా బేగం” లేదా “మోనా లిసా మేరీ” అని పేరు పెట్టాలని సూచించారు.మరొకరు ఆమె “త్రీ ఇడియట్స్” సినిమాలోని పాత్రలా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

చాలామంది ఆ కళాఖండాన్ని ప్రశంసించారు.ఒకరు “ఈ వెర్షన్ అసలు చిత్రం కంటే మరింత అందంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.

భారతీయ మహిళగా కనిపిస్తున్న మోనా లీసా ఇమేజ్‌ను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube