కొత్తిమీర( Coriander Leaves ) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.ఇంట్లో ఏ నాన్ వెజ్ వండినా చివర్లో కొత్తిమీర పడాల్సిందే.
అలాగే బిర్యానీ, పులావ్ వంటి రైస్ ఐటమ్స్ లో కూడా కొత్తిమీరను ఉపయోగిస్తారు.ఆహారానికి చక్కని రుచి, ఫ్లేవర్ ను అందించే కొత్తిమీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
అంతే కాదండోయ్ కొత్తిమీర కురుల సంరక్షణకు సైతం తోడ్పడుతుంది.ముఖ్యంగా హెయిర్ ఫాల్ కు( Hair Fall ) అడ్డుకట్ట వేసే సత్తా కొత్తిమీరకు ఉంది.
మరి అందుకోసం కొత్తిమీరను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కలబంద ఆకుని( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ కొత్తిమీర, మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు,( Curd ) వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ కొత్తిమీర హెయిర్ మాస్క్ ను వేసుకుంటే మస్తు లాభాలు పొందుతారు.ముఖ్యంగా కొత్తిమీరలో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి మరియు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు తలకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి.ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.కొత్తిమీర ఆకుల్లో సహజసిద్ధమైన యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి, ఇవి చుండ్రును తొలగించడంలో తోడ్పడతాయి.