మొదలైన చైతన్య శోభిత పెళ్లి వేడుకలు... వైరల్ అవుతున్న హల్దీ ఫోటోలు!

నాగచైతన్య( Nagachaitanya ) శోభిత( Sobhita ) డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో వివాహం చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.

 Naga Chaitanya And Sobhita Haldi Photos Goes Viral Details, Nagachaitanya,sobhit-TeluguStop.com

ఇక తాజాగా వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్( Pre Wedding Celebration ) కూడా మొదలయ్యాయని తెలుస్తుంది.ఇదివరకే శోభిత పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా వీరి హల్ది( Haldi ) ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా నాగచైతన్య శోభిత హల్దీ వేడుకను ఎంత ఘనంగా నిర్వహించారని తెలుస్తుంది.

Telugu Haldi, Nagachaitanya, Nagarjuna, Pre, Sobhita-Movie

నాగచైతన్య శోభిత ఇద్దరికీ ఒకే చోట హల్ది వేడుకను నిర్వహించడమే కాకుండా మంగళ స్నానాలు కూడా చేయించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఈ వేడుక  అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగాయని తెలుస్తుంది.

ఇక శోభిత నాగచైతన్యల వివాహం బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం జరగబోతుందని తెలుస్తోంది.డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల నుంచి వీరి వివాహం ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.

Telugu Haldi, Nagachaitanya, Nagarjuna, Pre, Sobhita-Movie

ఇక నాగచైతన్య శోభిత హల్ది వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరి అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈ పెళ్లి వేడుకలలో అత్యంత సన్నిహితులు ఇరువురి కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ముఖ్య అతిథులు మాత్రమే హాజరు కాబోతున్నారని వీరి వివాహం సింపుల్ గానే జరగబోతుందని ఇటీవల నాగార్జున( Nagarjuna ) స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇక నాగచైతన్య శోభిత వివాహం పూర్తి కాగానే నాగార్జున మరో కుమారుడు అఖిల్ వివాహ వేడుకలు కూడా అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.ఇప్పటికే అఖిల్ జైనాబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube