సమ్మర్ సీజన్ రానే వచ్చింది.రోజులు గడుస్తున్న కొద్ది ఎండలు మరింత తీవ్రంగా మారుతున్నాయి.
దాంతో ప్రజలు ఇంటి నుంచి బయట కాలు పెట్టేందుకే జంకుతున్నారు.ఇక వేసవి కాలంలో ప్రధానంగా వేధించే సమస్యల్లో హైబీపీ ఒకటి.
ఎండల్లో ఎక్కువగా తిరగడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఉప్పు అధికంగా తీసుకోవడం వంటి రకరకాల కారణాల వల్ల రక్తపోటు స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి.దాంతో ఈ సమస్యను నియంత్రించుకోవడం కోసం మందులు వాడతారు.
అయితే హైబీపీ కంట్రోల్‌లోకి తేవడంలో కొన్ని కొన్ని పండ్లు కూడా అద్భుతంగా సహాయపడతాయి.మరి ఆ పండ్లు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
కివి పండు.దీని ఖరీదు కాస్త ఎక్కువే అయినా అందుకు తగ్గా పోషకాలు అందులో పుష్కలంగా నిండి ఉంటాయి.
అందుకే కివి పండు ఆరోగ్య పరంగా బోలెడన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంటుంది.ముఖ్యంగా సమ్మర్‌లో హైబీపీతో సతమతం అయ్యేవారు.
రోజుకు ఒక కివి పండు తీసుకుంటే రక్తపోటు స్థాయిలో అదుపులో ఉంటాయి.అలాగే వేసవిలో విరి విరిగా లభ్యమయ్యే పుచ్చకాయ కూడా అధిక రక్తపోటును కంట్రోల్ చేయగలదు.
రోజుకు ఒక కప్పు పుచ్చముక్కలు లేదా గ్లాస్ పుచ్చకాయ జ్యూస్ తీసుకుంటే బీపీ అదుపులో ఉండటంతో పాటు బాడీ డీహైట్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది.

స్ట్రాబెర్రీలు.చాలా మంది ఇష్టంగా తినే పండ్లలో ఇవి ఒకటి.ఇవి రుచిగా ఉండటమే కాదు.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అందులోనూ ప్రస్తుత సమ్మర్‌లో స్ట్రాబెర్రీ పండ్లను తరచూ తీసుకుంటే హైబీప్ సమస్య నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక ఇవే కాకుండా అరటి పండు, మామిడి పండు, దానిమ్మ పండు వంటివి కూడా రక్తపోటు స్థాయిలను అదుపులోకి తీసుకురాగలవు.కాబట్టి, సమ్మర్‌లో ఈ ఫ్రూట్స్‌ను డైట్‌లో చేర్చుకోవడం మాత్రం మరచిపోకండి.







