సమంత ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పుష్పసినిమా లో సమంత ఐటెం సాంగ్ చేసి అందరి చేత శబాష్ అనిపించు కుంది.
ఈమె విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ విడాకుల తర్వాత మాత్రం వరుస సినిమాలు అంగీకరిస్తూ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.
టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు సిద్ధం అయ్యింది.ఇక ఈమె ఫ్యాషన్ లో ఎంత ట్రెండింగ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎప్పటి కప్పుడు సరికొత్త ఫ్యాషన్ ను ఫాలో అవుతూ ఉంటుంది.ప్రెసెంట్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచింది.

తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ సోషల్ మీడియా వేదికగా చెప్పింది.ఈ సినిమా ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.ఈ సినిమా తాజాగా తన డబ్బింగ్ పూర్తి చేశానంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది.దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.శాకుంతలం సినిమా మరొక అడుగు ముందుకు వేసినట్టే అని సంతోషంగా ఉన్నారు.
ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టు కుంది.
ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఇక సామ్ ఈ సినిమాతో పాటు రెండు ద్విభాషా చిత్రాలను లైన్లో పెట్టింది.
తర్వాత ప్రాజెక్ట్ యశోద షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి కూడా చేసింది.అలాగే ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఈమె చేతిలో ఉంది.
దీంతో సామ్ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.రానున్న రోజుల్లో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం లేకపోలేదు.







