తెల్ల జుట్టుకు చెక్ పెట్టే నువ్వులు.. ఇంతకీ వాటిని ఎలా వాడాలో తెలుసా?

నువ్వులు.( Sesame seeds ).చిన్నగా ఉన్నా కూడా వీటిలో పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి.నిత్యం రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తినడం వల్ల ఎన్నో జ‌బ్బులకు దూరంగా ఉండొచ్చు అని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు.

 Sesame Seeds Helps To Protect From White Hair Naturally! Sesame Seeds, Sesame Se-TeluguStop.com

అది అక్షరాల సత్యం.అయితే ఆరోగ్య పరంగానే కాదు జుట్టు సంరక్షణకు కూడా నువ్వులు ఉపయోగపడతాయి.

ముఖ్యంగా తెల్ల జుట్టుకు చెక్ పెట్టేందుకు నువ్వులు సహాయపడతాయి.చాలామంది తెల్ల జుట్టు వచ్చాక దాన్ని కవర్ చేసుకునేందుకు రంగులపై ఆధారపడుతుంటారు.

Telugu Black, Care, Care Tips, Sesame Seeds, Sesameseeds, Thick, White-Telugu He

కానీ నువ్వులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే ఆ అవసరం ఉండదు.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి వాటర్ తో ఒకటి లేదా రెండు సార్లు వాష్ చేయాలి.ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుస‌టి రోజు నానబెట్టుకున్న నువ్వులను మిక్సీ జార్ లో వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్( Amla powder ) రెండు టేబుల్ స్పూన్లు బాదం ఆయిల్ ( Almond oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Black, Care, Care Tips, Sesame Seeds, Sesameseeds, Thick, White-Telugu He

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్( Shower cap ) ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా చేస్తే కనుక జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది.

దాంతో తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.వయసు పై బడిన సరే జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.

పైగా నువ్వులతో ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టుకు ప్రోటీన్ అందుతుంది.ఫ‌లితంగా కుదుళ్లు బలోపేతం అవుతాయి.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube