నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో పలువురు భారతీయులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుంటారు.అక్కడ ఎన్నో కష్టాలు పడి, బాధలను దిగమింగి భారత్‌లోని కుటుంబ సభ్యులకు డబ్బు పంపుతూ ఉంటారు.
తాను ఇక్కడ నరకం అనుభవిస్తున్నా, కనీసం అయినవాళ్లైనా సుఖంగా ఉంటారన్న ఆనందంతో వారు బాధను మరిచిపోతుంటారు.అయితే గల్ఫ్ దేశాల్లో పని ఇప్పిస్తామంటూ ట్రావెల్ ఏజెంట్లు చేసే మోసానికి బలై వేలాది మంది ఆయా దేశాల జైళ్లలో మగ్గుతున్నారు.
దీనికి తోడు ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ లాక్కొని యజమానులు పెట్టే చిత్రహింసలు మరో కోణం.ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా గల్ఫ్ దేశం కువైట్( Kuwait )లో నరకయాతన అనుభవిస్తున్న ఓ తెలుగు వ్యక్తి అక్కడి బాధలను చెబుతూ తనను కాపాడాలని వీడియో సందేశాన్ని పంపాడు.అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ అనే వ్యక్తికి భార్య శంకరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.కుటుంబానికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో శివ కువైట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.రాయచోటికి చెందిన ఓ ఏజెంట్ ద్వారా శివ నెల రోజుల క్రితం కువైట్‌కు వెళ్లాడు.అక్కడ ఏడారి ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతుల్ని మేపే పనిలో చేరాడు.కనుచూపు మేరలో జనసంచారం లేకపోవడం, యజమానులు కనీసం వచ్చి చూడకపోవడం, ఆహారం, నీటిని అందించకపోవడంతో శివ మానసికంగా కృంగిపోయాడు.
దీంతో తన భార్యను, ఏజెంట్‌ను సంప్రదించి తనను రక్షించాలని కోరారు.అయితే అలా సాధ్యం కాదని పనిచేయాల్సిందేనని ఏజెంట్ తేల్చిచెప్పాడు.
ఈ నేపథ్యంలో మరింత కృంగిపోయిన శివ .కువైట్‌లో తన కష్టాలపై ఓ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టాడు.

ఎడారిలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని.తనకు చెప్పిన పని ఒకటి, ఇక్కడ చేస్తోంది ఒకటని .చుట్టూ ఇసుక దిబ్బలు తప్పించి మాట్లాడేందుకు ఒక్క మనిషి కూడా లేడని శివ ఆవేదన వ్యక్తం చేశారు.ఎండ తీవ్రతకు ఆరోగ్యం దెబ్బతిందని, ఇంకో రెండ్రోజులు ఇక్కడుంటే చనిపోతానని తనను రక్షించాలని శివ కన్నీటి పర్యంతమయ్యాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో విషయం మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh )దృష్టికి వచ్చింది.కేంద్రం సాయంతో త్వరలోనే ఆయనను సురక్షితంగా భారత్‌కు తీసుకొస్తామని.
శివ కుటుంబ సభ్యులతో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం టచ్‌లో ఉందని నారా లోకేష్ తెలిపారు.