నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ లో పెట్టుబడులు పెట్టొద్దు:ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ జిల్లా:నకిలీ స్టాక్ మార్కెట్ యాప్( Fake stock market app ) లో పెట్టుబడి పెట్టి అధిక రాబడికి ఆశపడి మోసపోవద్దని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్( SP Sarath Chandra Pawar ) ఒక ప్రకటనలో తెలిపారు.అధిక రాబడుల వాగ్దానాలతో మోసగాళ్లు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షిస్తున్నారని,జెఫరీస్ ఎంటర్ప్రైస్,సాక్షిసింగ్ మోతీలాల్ ట్రేడ్ వంటి నకిలీ మొబైల్ యాప్ ద్వార ఎవరైనా వేరు వేరు బ్యాంక్ ఎకౌంట్స్ లలో డబ్బులు వేయించుకొని, నమ్మించి వాట్సాప్ ద్వార పరిచయమై అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలని వాట్సాప్ కాల్ ద్వార మాట్లాడుతూ, వాట్సాప్ గ్రూప్లు (WhatsApp groups )క్రియేట్ చేసి నమ్మించి పెట్టుబడి పెట్టేలచేసి, అధిక లాభాన్ని చూపించి డబ్బులు పెట్టిన తరువాత వాటిని విత్ డ్రాకు అవకాశం ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నారన్నారు.

 Don't Invest In Fake Stock Market App: Sp Sarath Chandra Pawar-TeluguStop.com

ఇటువంటి మోసపూరిత నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ పై అప్రమత్తంగా వుండాలని, ఇలాంటి ఒక సంఘటనపై ఒక బాడితుడు కంప్లైంట్ చేయగా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయటం జరిగిందని,దీనిలో భాదితుడు ఎక్కువ లాభాలు ఆశించి పైన తెల్పిన జెఫరీస్ ఎంటర్ప్రైస్ మరియు సాక్షిసింగ్ మోతీలాల్ ట్రేడ్ వంటి నకిలీ మొబైల్ యాప్ లో సుమారు పదకొండు లక్షలు వరకు పెట్టుబడి పెట్టి మోసపోయాడని,నల్లగొండ జిల్లా ప్రజలు ఇలాంటి సంఘటనలు ముందుగానే గుర్తించి నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ వైపు ఆకర్షించవద్దని, అట్టి వారిని ముందుగానే గుర్తించి వారి కాల్స్ ను బ్లాక్ చేయడం మంచిదన్నారు.సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని,ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటెనే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి తెలియజేయాలని,లేదా మీకు అందుబాటులోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube