రాత్రివేళ పొర‌పాటున కూడా ట‌మాటాను తినొద్దు..ఎందుకంటే?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా విరి విరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటా ముందుంటుంది.వెజ్‌ కూర‌ల్లో అయినా, నాన్ వెజ్ కూర‌ల్లో అయినా, బిర్యానీలో అయినా, సాంబార్‌లో అయినా ట‌మాటా ప‌డితేఆ రుచే వేరు.

 Why Not To Eat Tomatoes At Night? Eat Tomatoes At Night, Eat Tomatoes, Tomatoes,-TeluguStop.com

అయితే రుచిలోనే కాదు ట‌మాటాలో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, విట‌మిన్ బి, కాల్సియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్‌, ప్రోటీన్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

అందుకే ట‌మాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఎన్నో జ‌బ్బుల‌ను కూడా నివారిస్తుంది.అయితే ట‌మాటా ఆరోగ్యానికి ఎంతో మంచి చేసిన‌ప్ప‌టికీ రాత్రి వేళ మాత్రం తీసుకోరాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

రాత్రి పూట ట‌మాటాను తీసుకోవ‌డం వ‌ల్ల‌ నిద్ర‌కు భంగం క‌లుగుతుంది.టమాటాల్లో టైరమైన్ అనే ఒక రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది.

అందు వ‌ల్ల‌, రాత్రి పూట ట‌మాటాను తీసుకుంటే గ్యాస్‌, ఎసిడిటీ, గుండెళ్లో మంట వంటి జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.దాంతో నిద్ర‌కు ఆట‌కం క‌లుగుతుంది.

Telugu Eat Tomatoes, Tips, Latest, Tomatoes, Vegetables-Telugu Health - తె

ఇక ట‌మాటానే కాదు ఇంకొన్ని కూర‌గాయ‌ల‌ను కూడా నైట్ టైమ్‌లో తీసుకోరాదు.అలాంటి వాటిలో కీరదోస ఒక‌టి.కీర‌దోస‌లో వాట‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది.అందువ‌ల్ల‌, రాత్రి వేళ కీర‌దోస‌ను తీసుకుంటే త‌ర‌చూ యూరిన్ పాస్ చేయాల్సి వ‌స్తుంది.దాంతో నిద్ర చెడుతుంది.

Telugu Eat Tomatoes, Tips, Latest, Tomatoes, Vegetables-Telugu Health - తె

అలాగే బ్రోకలీ, కాలీఫ్లవర్ మరియు క్యాబేజీ వంటి కూర‌గాయ‌ల‌కు కూడా రాత్రి పూట దూరంగా ఉండాలి.ఈ కూర‌గాయ‌ల్లో ఫైబ‌ర్ అత్య‌ధికంగా ఉండ‌టం వ‌ల్ల‌ త్వ‌ర‌గా జీర్ణం కావు.దాంతో క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

అదేవిధంగా, బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన‌ప్ప‌టికీ.రాత్రి వేళ మాత్రం తీసుకోరాదు.

రాత్రిపూట బీట్‌రూట్ తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.దాంతో అనేక ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube