వైసీపీ ఏపీలో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఆ పార్టీలో పదవులు అనుభవించిన నేతల్లో టెన్షన్ మొదలైంది .గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, అవినీతి వ్యవహారాలను వెలికి తీసే విషయంలో టిడిపి, జనసేన , బిజెపి కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉండడం , ఇప్పటికే అనేక మందిపై కేసులు నమోదు చేయడం, మరికొన్ని వాటిపై విచారణలు చేయిస్తుండడంతో వారిలో ఆందోళన పెరిగిపోతుంది.175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసిపి అభ్యర్థులు గెలుపొందడం, ఈ ఐదేళ్ల పాటు పార్టీలోనే ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వ్యక్తిగతంగా , రాజకీయంగా , ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్న చాలామంది నేతలు ఇప్పటికే కూటమి పార్టీలోకి సర్దుకుంటున్నారు.ఆ పార్టీలో చేరేందుకు ఇష్టం లేనివారు … గతంలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన వారు ఇప్పుడు మళ్ళీ చేరితే ఎలా ఉంటుందనే దానిపైన అంచనాలు వేసుకుంటున్నారట.
ఏపీలో వైసీపీ( YCP ) క్రమక్రమంగా బలహీనం అవుతుందని, వైసిపి అధినాయకత్వం ఒంటెద్దు పోకడలు, రాజకీయ మిత్రులు లేకపోవడం , రాజకీయంగా సరైన దిశా నిర్దేశం లేకపోవడం ఇవన్నీ రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తెస్తాయని భావిస్తున్న చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరితే ఎలా ఉంటుందని దానిపైన అంచనాలు వేసుకుంటున్నారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుండడం, ఏపీ పైన ఆ పార్టీ అధిష్టానం పూర్తిగా ఫోకస్ చేయడం, రాబోయే రోజుల్లో టిడిపి , జనసేన బిజెపి( TDP, Janasena, BJP ) కూటమికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ బలపడుతుందనే నమ్మకంతో ఆ పార్టీలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ నాయకులు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతూ ఉండడంతో , మళ్ళీ వారంతా తమకున్న పరిచయాలతో కాంగ్రెస్ అగ్ర నాయకులతో సంప్రదింపులు చేస్తూ, పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.ఇప్పటికే వైసీపీలోని సీనియర్ నాయకులను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే విధంగా కెవిపి రామచంద్ర రావు తెర వెనుక తతంగం నడిపిస్తున్నట్లు సమాచారం.
వైయస్సార్ జయంతి సమయంలో కేవీపీ ( KVP Ramachandra Rao )చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వైసీపీలోని చాలామంది కీలక నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రకటించారు .కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాత రాహుల్ గాంధీ టూర్ ఏపీలో ఉంటుందని , ఆ సమయంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.అదే గనుక జరిగితే ఇప్పటికే అనేక కష్టాల్లో ఉన్న వైసిపి మరిన్ని రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.