పార్టీని మళ్లీ అధికారం లోకి తీసుకువచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ చాలానే కష్టపడాల్సి ఉంటుంది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 11 స్థానాలను మాత్రమే దక్కించుకుని , ఘోర ఓటమిని చవిచూసింది.
ఇక ఈ ఐదేళ్లు పార్టీని ముందుకు నడిపించడం జగన్( YS Jagan Mohan Reddy ) కు అతిపెద్ద సవాల్ గా మారబోతుంది .ఈ ఐదేళ్లు పార్టీ నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లకుండా చూసుకోవడంతో పాటు , వారిపై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగినా, వారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేయడం, ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకుంటూ , మళ్లీ ఎన్నికల నాటికి బలం పుంజుకుంటేనే జగన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో జగన్ ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్లారని , కేవలం ఒకరిద్దరు సన్నిహితులకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ, వారి చెప్పినట్లుగానే పాలన చేసి ఈ స్థాయిలో పార్టీ ఓటమికి కారణమయ్యారనే విమర్శలు జగన్ పైన ఉన్నాయి .
![Telugu Ambati Rambabu, Ap, Kodali Nani, Pavan Kalyan, Telugudesam, Ysrcp-Politic Telugu Ambati Rambabu, Ap, Kodali Nani, Pavan Kalyan, Telugudesam, Ysrcp-Politic](https://telugustop.com/wp-content/uploads/2024/07/telugudesam-Pavan-Kalyan-ap-government-sajjala-ramakrishna-Reddy-kodali-Nani.jpg)
ముఖ్యంగా అప్పటి ప్రభుత్వ సలహాదారు , జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) కారణమని వైసీపీ ఓటమి తర్వాత అనేక విమర్శలు సొంత పార్టీ నాయకులు చేశారు.అధికారంలో ఉండగా జగన్ ను ఎవరు కలవాలన్నా ముందుగా సజ్జల అనుమతి ఉంటేనే అది సాధ్యమయ్యేదని , చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక సజ్జల హస్తం ఉందనే విమర్శలు వచ్చాయి.వైసిపి ఓటమి తర్వాత కూడా సజ్జలతో పాటు మరికొంతమంది కోటరీ నాయకులకే జగన్ ప్రాధాన్యం ఇస్తుండడం పైన పార్టీలో అసంతృప్తి పెరుగుతుంది.
![Telugu Ambati Rambabu, Ap, Kodali Nani, Pavan Kalyan, Telugudesam, Ysrcp-Politic Telugu Ambati Rambabu, Ap, Kodali Nani, Pavan Kalyan, Telugudesam, Ysrcp-Politic](https://telugustop.com/wp-content/uploads/2024/07/Ysrcp-telugudesam-Pavan-Kalyan-sajjala-ramakrishna-Reddy.jpg)
వైసీపీ( YCP )ని పూర్తిగా ప్రక్షాళన చేసి, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేయగలిగిన బలమైన నేతలకు పదవులు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని, అంతకంటే ముందుగా జగన్ కోటరీ లోని నాయకులను పక్కన పెట్టాలని, అప్పుడే జగన్ అనుకున్న లక్ష్యం చేరుకోగలుగుతారని ఆ పార్టీ నాయకులే సూచిస్తున్నారు.ముఖ్యంగా అప్పటి వైసిపి ప్రభుత్వం లోనూ , ఇప్పుడు ఓడిన తరువాత తమ నోటి దురుసును ప్రదర్శిస్తూ, వైసిపికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్న నాయకులను జగన్ పక్కన పెట్టాలనే సూచనలు చేస్తున్నారు.