తెలంగాణలో బీఆర్ఎస్ ను( BRS ) కాళీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి.( CM Revanth Reddy ) దీనిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు.
బిఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ దానికి అనుగుణంగానే వ్యూహలు రచిస్తున్నారు.ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.
అయితే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరితే వారిపై అనర్హత వేటు పడుతుందని భావిస్తున్న రేవంత్ బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని పెంచుకోవడంపైనే దృష్టి సారించారు.ఈ మేరకు బీఆర్ఎస్ లోని మిగతా ఎమ్మెల్యేల ను చేర్చుకోవడంపై దృష్టి సారించారు.
దీంతో పాటు త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోను( GHMC Elections ) కాంగ్రెస్ పట్టు సాధించే విధంగా వ్యూహం రచిస్తున్నారు.
ఈ బాధ్యతలను ఎమ్మెల్యే దానం నాగేందర్ కు( MLA Danam Nagendar ) రేవంత్ రెడ్డి అప్పగించారట.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 39 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు .కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 గా ఉంది. వారిలో 9 మంది కాంగ్రెస్ చేరడంతో, మిగిలిన వారిలో ముగ్గురు నలుగురు మినహా, మిగతా వారందరినీ కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రేవంత్ వ్యూహం రచించారు.గ్రేటర్ లో పట్టు కోసం దానం నాగేందర్ కు రేవంత్ బాధ్యతలు అప్పగించారట.
అది సక్సెస్ చేస్తే మంత్రి పదవి( Minister Seat ) ఇస్తానని ఆఫర్ కూడా దానంకు రేవంత్ ఇచ్చినట్లు సమాచారం.మరో 17 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను 15 రోజుల్లో కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్లాన్ సిద్ధం చేశారట.
ఈ విషయాన్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో( Congress ) చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బిఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని, ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారటూ దానం నాగేందర్ ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు .జిహెచ్ఎంసి ఎన్నికలతో పాటు , స్థానిక సంస్థల ఎన్నికల్లోను తమ బలాన్ని పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహం రచించినట్లుగా అర్థమవుతుంది. గ్రేటర్ ఎమ్మెల్యేలను బీ ఆర్ ఎస్ లోకి తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తానంటూ రేవంత్ ఆఫర్ ఇవ్వడంతోనే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు ముమ్మరం చేశారట.