అనంత్ అంబానీ( Ananth Ambani ) రాధిక మర్చంట్( Radhika Marchant ) వివాహ వేడుకలకు సంబంధించిన విషయాల గురించి ఎంత చెప్పినా తక్కువే.గత కొద్ది నెలల నుంచి వీరి వివాహానికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఇటీవల జూలై 12వ తేదీ వీరి వివాహం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ పెళ్లి ఖర్చు సుమారు ఐదువేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఈ విధంగా ముఖేష్ అంబానీ ఇంట్లో చివరి పెళ్లి కావడంతో అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ఇప్పటివరకు ఏ వివాహం జరగని విధంగా ఈ వివాహపు వేడుకలను జరిపించారు.ఈ కార్యక్రమంలో ఎంతోమంది ప్రముఖులు హాజరై సందడి చేశారు.
కేవలం వ్యాపారవేత్తలు మాత్రమే కాకుండా సినిమా సెలెబ్రెటీలు క్రీడా రంగానికి చెందినవారు రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకలలో పాల్గొని సందడి చేశారు.
ముఖ్యంగా ఎంతో మంది బాలీవుడ్ తారలు ఈ పెళ్లి వేడుకలలో సందడి చేసిన సంగతి తెలిసిందే.అయితే అనంత్ అంబానీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది స్నేహితులు ఉన్నారు.అయితే వారి కోసం ఈయన ప్రత్యేకంగా కొన్ని గిఫ్టులను అందజేశారని తెలుస్తుంది.
షారుక్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ ,రణవీర్ సింగ్ వంటి వారందరూ అనంత్ స్నేహితులు కావడంతో వారికోసం ప్రత్యేకంగా అడేమార్స్ పిగ్యూట్ రాయల్ ఓక్ పేర్పుట్యల్ కాలండేర్ కంపెనీకి చెందిన వాచ్లను కానుకగా అందించారని తెలుస్తుంది.మార్కెట్లో ఈ బాచుల ఖరీదు సుమారు రెండు కోట్ల వరకు విలువ చేస్తుందని సమాచారం.
ఇలా ఈ హీరోలందరికి ఖరీదైన చేతి వాచ్ ( Wrist watch ) ను కానుకగా ఇచ్చారనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.