సాధారణంగా రాత్రి నిద్ర పోయేటప్పుడు చాలామందికి కలలు వస్తూ ఉంటాయి.కానీ కొంతమందికి రాత్రి పూట వచ్చే కలలు కొన్ని మాత్రమే గుర్తుంటాయి.
మరి కొంతమంది కలలు వచ్చినా అవి వారికి గుర్తు ఉండవు.నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అనేది సహజం.
అయితే కొన్ని కలల అర్ధాన్ని స్వప్న శాస్త్రం( Swapna Shastra )లో వెల్లడించారు.మనకు వచ్చే కొన్ని కలలు మనకు మంచి సూచనలను అందిస్తే, కొన్ని కలలు మనకు అశుభ సూచనలను అందిస్తాయి.
కొన్ని కలలు మనకు భవిష్యత్తు గురించి సమాచారం అందిస్తాయి.అయితే చనిపోయిన వారు మన కలలో కనిపిస్తే అదృష్టాన్ని సూచిస్తాయని పండితులు చెబుతున్నారు.
ఎలాంటి కలలు మన విధిని సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన కలలో తన వేలికి బంగారం ఉంగరం తొడిగినట్లు కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలో అనుకూలమైన జీవిత భాగస్వామిని పొందుతాడని అర్థం చేసుకోవచ్చు.
కలలో చకోర పక్షిని చూసే వ్యక్తి అదృష్టవంతుడు.ఈ పక్షి గురించి కలలు కనడం మీ అదృష్టాన్ని సూచిస్తుంది.
ఇంకా చెప్పాలంటే మీ కలలో పచ్చని పొలాన్ని చూడడం శుభ సంకేతమని పండితులు చెబుతున్నారు.అయితే మీ కలలో బంజార భూమిని చూడడం అదృష్టం అని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే మీ కలలో శంఖం ( Cone )కనిపిస్తే మీకు ఎక్కడి నుంచైనా డబ్బు వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు.అలాగే కలలు మీ ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడతాయి.
ఇంకా చెప్పాలంటే మీ కలలో చేపలను ( Fish )చూసినట్లయితే మీరు శుభవార్త వింటారని అర్థం చేసుకోవచ్చు.అంతే కాకుండా కలలో బంగారు చేపలు కనిపిస్తే సమాజంలో ప్రేమ, గౌరవం లభిస్తాయి అని అర్థం చేసుకోవచ్చు.దీనితో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా మీపై చాలా ప్రేమను చూపుతారు.