సాధారణంగా సెలబ్రిటీల జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందికర ఘటనలు జరుగుతుంటాయి.అవి ఎలా ఉంటాయంటే వారిపై వారికే జాలి కలిగించే లాగా ఉంటాయి.
ఉదాహరణకి రామాయణం అంతా విని రాముడు సీతకి ఏమవుతాడు అని ఒక వ్యక్తి అడిగితే ఎలా చిరాకు వేస్తుందో అలాంటిది సంఘటనలన్నమాట.ఈ కాలంలో ఇలాంటి నవ్వు పుట్టించే సంఘటనలను మోయే మోయే మూమెంట్స్ అంటూ చాలామంది వైరల్ కూడా చేస్తున్నారు.

అయితే రజనీకాంత్ ( Rajinikanth )జీవితంలో ఒకటి ఇలాంటి సంఘటన కొన్నేళ్ల క్రితం చోటు చేసుకుంది.ఆ సమయంలో రజనీకాంత్ రోబో సినిమాలో నటించాడు.ఆ మూవీ స్టోరీనంతా కూడా ఫ్రెండ్ కి చెప్పాడు.అయితే అంతా అయిపోయిన తర్వాత ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరు రా అని అతను అడిగాడట.
దాంతో రజనీకాంత్ అవాక్కయ్యి నవ్వాలో ఏడవాలో కూడా తెలియక బిక్క మొహం వేశారట.

హ్యాపీడేస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఇందులో రాజేష్ పాత్ర పోషించిన నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha ) బాగా హైలైట్ అయ్యాడు.తెలంగాణ యాసలో ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చే యువకుడి లాగా నటించాడు.
అయితే ఈ మూవీ పూర్తయిన తర్వాత ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు నిఖిల్ ని ఉద్దేశించి “మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు?” అని ప్రశ్నించారు.పక్కనే శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) కూడా ఉన్నాడు.
అతడు తన పేరే చెబుతాడేమో అని అనుకున్నాడు కానీ నిఖిల్ మాత్రం తన ఫేవరెట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అని చెప్పి శేఖర్ కమ్ములకు షాకిచ్చాడు.ఇక బాలకృష్ణ( Balakrishna ) ఏ సినిమా ఈవెంట్లో పాల్గొన్నా మాట్లాడే ముందు మైకు విసిరేసి తర్వాత క్యాచ్ పట్టి ఆపై మాట్లాడతాడు.
అయితే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఇలాంటి స్టంట్ చేద్దామనుకున్నాడు కానీ మైకు చేజారి కింద పడిపోయింది.దాంతో బాలకృష్ణ జీవితంలో ఒక మోయే మోయే మూమెంట్ వచ్చింది.
ఇక ఇలాంటి మూమెంట్స్ ఉన్న మిగతా నటీనటులు కూడా ఉన్నారు.సోషల్ మీడియాలో కొంతమంది సినీ సెలెబ్రిటీలు చేసే కామెంట్స్ బ్యాక్ ఫైర్ అవుతుంటాయి అలాంటి సమయంలో వీరు ఇబ్బందికర పరిస్థితులను ఫేస్ చేస్తుంటారు.
ఇవన్నీ కామనే అందుకే సెలబ్రిటీలు, వారి ఫ్యాన్స్ వీటి గురించి పెద్దగా పట్టించుకోరు.