గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ట్రెండ్ బాగా కనిపిస్తోంది.అదేంటంటే, సినిమా రిలీజ్ కాక ముందుగానే పోస్టర్లు, టీజర్లు, పాటలు, ట్రైలర్లు విడుదల చేస్తూ ప్రేక్షకులలో అంచనాలు పెంచడం.
ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి.టీజర్లు, ట్రైలర్లలో చూపించే అద్భుత దృశ్యాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచుతాయి.
కానీ, చాలా సందర్భాల్లో ఈ హైప్‌కు రీచ్ అవ్వలేక డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి.స్టార్ హీరోల సినిమాలు కూడా దీనికి అతీతం కావు.
టీజర్, ట్రైలర్లతో భారీ అంచనాలు పెంచి, రిలీజ్ అయిన తరువాత ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు చాలా ఉన్నాయి.వాటిలో పది సినిమాల గురించి తెలుసుకుందాం.</br?
శక్తి
జూ.ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ తీసిన “శక్తి( shakti movie )” సినిమా భారీ హైప్స్ నడుమ విడుదలై డిజాస్టర్ అయింది.ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్‌ను బాగా అఫెక్ట్ చేసింది.</br?
స్పైడర్
మహేష్ బాబు, ఏ.ఆర్ మురుగదాస్ కాంబోలో వచ్చిన “స్పైడర్( Spyder )” టీజర్ , ట్రైలర్‌లతో చాలా బజ్ క్రియేట్ చేసింది.కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా ఫ్లాప్ అయ్యింది.ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య కూడా కీలక పాత్రలో నటించారు.</br?
అజ్ఞాతవాసి
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన “అజ్ఞాతవాసి( Agnathavasi )” కూడా అంచనాలను రీచ్ కాలేక అట్టర్ ఫ్లాప్ అయ్యింది.కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించారు.</br?
దడ
అక్కినేని నాగచైతన్య, కాజల్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా దడ( Dhada ) కూడా డిజాస్టర్ గా నిలిచింది.వీరిద్దరి కాంబోలో హిట్ వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశించారు కానీ నిరాశే ఎదురయింది.
డియర్ కామ్రేడ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ఈ సినిమా చాలా లెంగ్తీగా ఉండటం వల్ల ఫెయిల్ అయింది.గీత గోవిందం తర్వాత వీరిద్దరి కాంబో డియర్ కామ్రేడ్ ద్వారా రిపీట్ అయింది కాబట్టి ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నారు.భరత్ కమ్మ దీనిని డైరెక్ట్ చేశాడు.</br?
సాహో
బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన సినిమా “సాహో( Saaho )” పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది.</br?
ది ఘోస్ట్
కింగ్ నాగార్జున, దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ స్పైథ్రిల్లర్ ది ఘోస్ట్ ( The Ghost )కూడా డిసప్పాయింట్ చేసింది.</br?
రావణాసుర
మాస్ మహారాజా రవితేజ “రావణాసుర” మూవీ చాలా హైప్ క్రియేట్ చేసింది.ఈ సినిమాలోని అతని పాత్ర, టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తిని పెంచాయి కానీ చివరికి ఈ సినిమా ఎదురు తన్నింది.</br?
ఏజెంట్
అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసిన సినిమా ఏజెంట్.ఇందులోని మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించారు.టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఈ మూవీపై ఆసక్తిని బాగా పెంచేసాయి.అయితే ఇది డిజాస్టర్ అయింది.