శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇండియన్2( Indian 2 ) సినిమాకు భారీ నష్టాలు రావడం ఖాయమని తేలిపోయింది.ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సినిమా పుంజుకోవడం కష్టమేనని వెల్లడైంది.
తమిళనాడు రాష్ట్రంలో సైతం ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.భారతీయుడు సినిమాకు సీక్వెల్ అయినా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను పట్టించుకోకపోవడం కొసమెరుపు.ఇండియన్2, ఇండియన్3 రెండు భాగాలుగా తెరకెక్కించడమే ఈ సినిమా రిజల్ట్ కు కారణమని చాలామంది భావిస్తారు.భారతీయుడు2 సినిమా ఫ్లాపైనా లాభపడింది మాత్రం కమల్ హాసన్( Kamal Haasan ) అని ఈ సినిమాకు పారితోషికంగా ఆయన 75 కోట్ల రూపాయలు అందుకున్నారు.ఇండియన్3 సినిమాకు సైతం కమల్ హాసన్ అదే రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది.కమల్ హాసన్ తప్ప ఈ సినిమాకు పని చేసిన ఎవరూ లాభ పడలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఇండియన్2 సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమా శంకర్( Shankar ) సినీ కెరీర్ లోనే చెత్త సినిమా అని తన స్థాయిని తగ్గించే సినిమాలు తీసి శంకర్ విమర్శల పాలు కావడం వల్ల లాభమేంటని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా ప్రశంసలు పొందిన శంకర్ ఇప్పుడు యంగ్ డైరెక్టర్లకు పోటీ ఇవ్వలేని స్థాయికి దిగజారిపోవడం కొసమెరుపు.శంకర్ కూడా ఈ సినిమాలో వాటా తీసుకున్నారని భోగట్టా.
శంకర్ కు ఈ సినిమా వల్ల భారీ నష్టాలు ఖాయమని తేలిపోయింది.2024 సంవత్సరంలోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఈ సినిమా ఒకటని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.శంకర్ తర్వాత సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఆయనకు కొత్త ఆఫర్లు రావడం కష్టమని చెప్పవచ్చు.
శంకర్ కెరీర్ ప్లానింగ్స్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.