హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) లైవ్ షో పర్ఫార్మెన్స్ ఉంటుందని స్వయంగా ఆయనే ప్రకటించారు.జూలై 14 న రాక్‌స్టార్ డీఎస్పీ తన సోషల్ మీడియా ఖాతాలో #DSPLiveIndiaTour లో భాగంగా హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ఆయన మ్యూజిక్ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.అందులో భాగంగా హైదరాబాద్ నుంచే ఈ వేడుక ప్రారంభం కానున్నట్లు తెలిపారు.ఈ ప్రకటన చూసిన సంగీత ప్రియుల ఆనందానికి అవదులు లేవు.25 సంవత్సరాలుగా తాను సంగీత ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించారు.అలాంటిది మొదటి సారి హైదరాబాద్‌లో డీఎస్పీ లైవ్ షో ఉంటుందంటే ఎలా ఉంటుందో అని అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇన్నాళ్లు సినీ ప్రపంచంలో సంగీత రారాజుగా ఉన్నాడు.తెలుగు, తమిళ్, హిందీ ఇతర భాషాల్లో సైతం సంగీతం అందించి అందరినికి ఉర్రుతలూగించారు.ఇప్పుడు లైవ్ షో ద్వారా తన సొంత ప్రజల్ని, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న అభిమానులను అలరించాడానికి సిద్దం అయ్యారు.
కళ్లు మిరమిట్లు గొలిపై లైటింగ్, స్టేజ్ సెటప్, లైవ్ కంపోజిషన్లతో అద్యంతం అలరించ విధంగా ఈ వేడుక ఉండబోతోంది.సంగీత ప్రియులు అభిరుచికి తగ్గట్టు ఉండే వాతవరణంతో అందరిలో జోష్ నింపే మ్యూజిక్‌తో ఈ కాన్సెర్ట్ ఓ మరపురాని అనుభూతిగా చరిత్రలో మిగిలిపోనుంది.
US, UK, యూరప్, ఆస్ట్రేలియా, UAE లతో పాటు ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చి ఇప్పుడు స్వదేశం తిరిగి వచ్చారు.సొంతగడ్డపై సంగీత ప్రియులను మైకంలో పడేయ్యడానికి సిద్ధం అయ్యారు.
డీఎస్పీ మ్యూజిక్, ఎనర్జీ గురించి అందరికీ తెలుసు.అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసిన ఎన్నో ప్రొగ్రామ్స్ విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి.
ఆయన మ్యూజిక్కు ప్రపంచమే ఊగిపోయింది.అలాంటి డీఎస్పీ ఇప్పుడు మన దేశంలో ప్రదర్శనలు ఇవ్వడానికి పూనుకున్నారు.
అందులో భాగంగా సొంత గడ్డ హైదరాబాద్( Hyderabad )లో ఆయన మొదటి ప్రదర్శనతో ఈ #DSPLiveIndiaTour ప్రారంభించనున్నారు.
#DSPLiveIndiaTour ప్రొగ్రామ్‌ను, ACTC( ACTC event ) అనే ఈవెంట్ సంస్థ నిర్వహిస్తోంది.ఇది కేవలం సంగీత కచేరీ మాత్రమే కాదు, డ్యాన్సులతో అలరించే ఓ అద్భుతమైన సందడి కలిగించే ఈవెంట్.ప్రతీ ఒక్కరూ కాలు కదిపేలా, కన్నుల పండుగగా సాగే ఈవెంట్‌గా జరగబోతుందని నిర్వాకులు పేర్కొన్నారు.
డీఎస్పీ క్రియేషన్స్ నుంచి వచ్చిన ఎన్నో హై-ఎనర్జీ ట్యూన్లతో ఈ షో ఉంటుందని చెబుతున్నారు.ఈ హై వోల్టేజ్ డీఎస్పీ కాన్సెర్ట్ చూడాలనే ఆసక్తి ఉన్నవారు ACTC ఈవెంట్లు, DSP సోషల్ మీడియా ఖాతాలను గమనిస్తూ ఉండండి.
అలాగే నగరంలో అక్టోబర్ 19న జరగబోయే కాన్సెర్ట్ కోసం ACTC ఈవెంట్ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.హైదరాబాద్ కాన్సెర్ట్ కోసం టిక్కెట్లు పొందాలంటే www.actcevents.com అనే వైబ్ సైట్ ద్వారా అలాగే Paytm ఇన్‌సైడర్‌లో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.
జూలై 14, 2024 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి.