చాలా మంది తమ ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్( skin whitening ) లను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ మిరాకిల్ సీరం మాత్రం మీ చర్మాన్ని తెల్లగా మెరిపించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.నెక్స్ట్ డే మార్నింగ్ మరో బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు రైస్ వాటర్, అలాగే వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ), వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, పావు టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని అన్నీ కలిసేలా ఓ ఐదు నిమిషాల పాటు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న సీరం ను అప్లై చేసుకుని పడుకోవాలి.రోజు నైట్ ఈ సీరంను రాసుకుంటే మీ చర్మం సహజంగానే తెల్లగా కాంతివంతంగా మారుతుంది. స్కిన్ వైట్నింగ్ కి సూపర్ గా హెల్ప్ చేస్తుంది.అలాగే ఈ సీరం ను వాడటం వల్ల చర్మం టైట్ అవుతుంది.
బ్రైట్ అవుతుంది. చర్మంపై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయమవుతాయి.
క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.