రెండు నెలల పాటు సావిత్రిని ఏడిపించిన సింగర్ జానకి.. ఎందుకంటే..

అలనాటి సినీ తార సావిత్రి( Savitri ) తన నటనాభినయంతో చాలా మందిని ఆకట్టుకున్నారు.ఆమె చక్కగా డైలాగ్స్‌ చెప్పేవారు.

 Singer Janaki Created Problems To Savitri , Savitri ,p Susheela , Kollywood,-TeluguStop.com

నటనకు తగ్గ వాయిస్ కారణంగా స్క్రీన్‌పై ఆమె నటిస్తుంటే ఎంతో చూడముచ్చటగా అనిపించేది.ఇక పాటల విషయంలోనూ ఆమెకు బాగా సూట్ అయ్యేలాగా పి.లీల ప్లేబ్యాక్‌ సాంగ్స్ పాడేవారు.తొలి రోజుల్లో నటించిన మాయాబజార్‌, పెళ్లి చేసిచూడు, మిస్సమ్మ వంటి అన్ని సినిమాల్లోనూ ఆమెకు గాత్రదానం చేశారు.

ఆమె పాడిన పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి.అందుకే తనకు పి.లీలానే పాటలు పాడాలని సావిత్రి డిమాండ్ చేసేవారు.

Telugu Gemini Ganesan, Kollywood, Konjum Salangai, Neeleela, Susheela, Savitri,

కొన్ని సంవత్సరాల తర్వాత సావిత్రికి పి.సుశీల పాటలు పాడటం స్టార్ట్ చేశారు.లీల తర్వాత మళ్లీ సావిత్రికి కరెక్ట్‌గా సూట్‌ అయ్యే గాత్రం సుశీలదే అయ్యింది.

సావిత్రి నటించిన ఎన్నో సినిమాల్లో సుశీల పాటలు పాడారు.వాటిలో సూపర్‌హిట్సే ఎక్కువగా ఉన్నాయి.

సావిత్రి సుశీల తప్ప తనకు ఎవరు తనకు పాట పాడినా తీవ్రంగా అభ్యంతరం చెప్పేవారు.ఇలాగే ఓ పాట విషయంలో సావిత్రి, ఎస్‌.

జానకి( S Janaki ) మధ్య మనస్పర్ధలు వచ్చాయి.దాంతో సావిత్రికి పాట పాడేదే లేదని జానకి కొండబద్దలు కొట్టింది.

అంతేకాదు, సావిత్రిని 2 నెలల పాటు జానకి బాగా ఏడిపించిందిఅసలేం జరిగిందో తెలుసుకుంటే, ఒకానొక సమయంలో జానకి ‘పడితాండ పత్తిని’ అనే తమిళ సినిమాలోని ఒక సాంగ్ పాడారు.అదొక మంచి మెలోడీయస్ సాంగ్‌.

రికార్డింగ్‌ అయిపోయాక ఆ సినిమాలో నటిస్తున్న సావిత్రి ఆ పాట విని బాగా డిసప్పాయింట్ అయ్యారు.తనకు సుశీల పాడితేనే సినిమాలో చేస్తానని మొండిగా పట్టు పట్టింది.

దాంతో సినిమా టీం చేసేదేమీ లేక జానకి పాటను పక్కన పడేశారు.సుశీలతో అదే పాడిన పాటించారు.

ఈ విషయం జానకి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.ఆ బాధలో సావిత్రికి ఇకపై పాటలు పాడకూడదు అని బలంగా డిసైడ్ అయ్యారు.

దీని తర్వాత సావిత్రికి మరో మూడు సినిమాల్లో పాడే అవకాశం జానకి వద్దకు వచ్చింది.అయితే వాటిని ఆమె సింపుల్‌గా రిజెక్ట్ చేసేశారు.

Telugu Gemini Ganesan, Kollywood, Konjum Salangai, Neeleela, Susheela, Savitri,

కొద్ది రోజులకి అంటే 1962లో జెమిని గణేశన్‌, సావిత్రి హీరో హీరోయిన్లుగా ‘కొంజమన్‌ సలంగై( Konjum Salangai )’ సినిమా తెరకెక్కింది.ఈ మూవీని ‘మురిపించే మువ్వలు’ టైటిల్‌తో తెలుగులోకి డబ్‌ చేయగా అందులోని పాటలు కూడా తెలుగు సింగర్స్ తో పాటించాల్సి వచ్చింది.ఓ పాట సంగీత ప్రధానంగా సాగుతుంది.సావిత్రికి ఎప్పుడూ ప్లేబ్యాక్‌ పాడే లీల ఆ పాట తాను పాడనని చెప్పారు.దాంతో సావిత్రి గుండె పగిలారు.అప్పట్లో ఆ పాటకు ఒక్క జానకి మాత్రమే న్యాయం చేయగలరని దర్శకుడు ఎస్‌.

ఎం.సుబ్బయ్యనాయుడు బలంగా నమ్మారు అందుకే ఆమెను కాంటాక్ట్ అయ్యారు.అప్పటికే సావిత్రికి పాడకూడదని డిసైడ్ అయిన జానకి ఊహించిన విధంగానే దానిని రిజెక్ట్ చేశారు.ఎంత బతిలాడినా పాడేందుకు ఆమె ఒప్పుకోలేదు.చివరికి లతా మంగేష్కర్‌తో ఆ పాట పాడించాలని ముంబైకి వెళ్లారు.కానీ, కొన్ని కారణాల వల్ల ఆమె కూడా ఆ పాట పాడలేను క్షమించండి అంటూ తిరిగి వెనక్కి పంపించేశారు.

అలా రెండు నెలలపాటు జానకి సావిత్రి తో పాటు మూవీ టీమ్‌ని ఏడిపించారు.అయితే ఏం ఆ పాటలో వేరే వారితో డాన్స్ చేస్తామని సావిత్రి ఉండనే ఉండదని ఆమెకు మీరు పాడాల్సిన అవసరం లేదని దర్శక నిర్మాతలు జానకిని మరోసారి రిక్వెస్ట్ చేశారు దాంతో ఆమె ఆ పాట పాడారు.

ముందుగా ఆమెను ఒప్పించడానికి దర్శక నిర్మాతలు ఆ మాట చెప్పారు కానీ చివరికి సావిత్రిని ఆ పాటలో నటింప చేశారు.ఆ పాట పేరు ‘నీ లీల పాడెద దేవా.

’ నాదస్వరంతో పోటీ పడుతూ జానకి ఈ సాంగ్ పాడారు.అప్పట్లో ఇది చాలా పెద్ద హిట్ అయింది.

ఈ పాట ఇప్పటికీ వినే వారు ఉన్నారు.ఎస్‌.

జానకి పాడిన బెస్ట్ సాంగ్స్ లో ఇదీ ఒకటిగా నిలిచింది.ఆ విధంగా సావిత్రికి జానకి చుక్కలు చూపించారు.

చివరికి పాట పాడి తనకే పేరు తెచ్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube