తాంబూలం తీసుకోవడం వల్ల ఉపయోగము ఉందా?

భోజనం తరువాత తాంబూలం వేసుకోవాలి.సంసార సుఖం అనుభవించేటప్పుడు, నిద్ర నుండి లేచిన తరువాత, స్నానం చేసిన తరువాత, యుద్ధంలో పండిత సభల్లో తాంబూలాన్ని సేవించాలని భావ ప్రకాశ వాక్కు.

 Is There Any Benifit In Taking Thambulam , Devotional , Taking Thambulam , Dev-TeluguStop.com

అలాగే గాయాలతో బాధ పడేవారు, కంటి రోగాలతో ఉన్న వారు, విష, మూర్ఛ, మద, క్షయాది రోగాలతో బాధపడే వారు వేసుకోకూడదని అష్టాంగ హృదయం చెబుతోంది.ఇది కామాన్ని వృద్ధి చేస్తుంది.

నోటి అరుచిని పోగొడుతుంది.శ్లేష్మాన్ని పోగొట్టడం, నాలుకను, ఇంద్రియాలను నిర్మలంగా చేయడం దీని గుణాలు.

జీర్ణశక్తికి మంచిది.పసుపు రంగుతో కూడిన తెలుపు రంగు గలిగిన ఆకులు మంచివన్నారు.

ఇందులో వేసే కవిరి, కఫ, పిత్తాలను, వాత శ్లేష్మాలను హరిస్తాయి.

ప్రొద్దున్న పోక చెక్క ఎక్కువ వేసుకోవాలి.

మధ్యాహ్నం కవిరి హెచ్చుగా వేసుకోవాలి. రాత్రి సున్నం ఎక్కువగాను ఉండాలి.

ఆకు యొక్క తొడిమి తింటే వ్యాధి, చివర తింటే పాపం, మధ్యలో ఉన్న ఈనెలు నమిలితే బుద్ధి పోతాయి కాబట్టి తొడిమి, చివరి భాగం, ఈనెలు లేకుండా చూసుకోవాలని భావ ప్రకాశ వ్యాఖ్య.నమిలేటప్పుడు, మొట్ట మొదట వచ్చే రసం విషంతో సమానం కాబట్టి ఉమ్మి వేయాలి.

రెండవ సారి కష్టంగా జీర్ణం అవుతుంది.కాబట్టి అదీ పనికి రాదు.

తరువాత మింగాలి.అమృతంతో సమానం.

ఒక వక్కతో తాంబూలం ఆరోగ్యాన్ని ఇస్తుంది.

Telugu Devotional, Thambulam, Telugu Bhakthi-Telugu Bhakthi

రెండు వక్కలు పనికి రాదు.మూడు వక్కలతో మంచిది.సున్నం ఉంచిన ఆకును వేసుకోకూడదు అని పరాశరుని వాక్కు.

జాజికాయ, లవంగాలు, పచ్చ కర్పూరం, తక్కోలం, మిరియాలు, వక్కతో కూడిన లేత తమల పాకులు వేసుకోవాలి.వట్టి వక్కలు తినకూడదు.ముందు వక్క వేసుకున్న తరువాత తమలపాకులు నమలకూడదు.సున్నం బొటన వేలితోగాని, మధ్య వేలుతో గాని రాసుకోవాలి.

దాని వల్ల ఆయుర్దాయం ఫలం అన్నారు.ఆకలితో ఉన్నప్పుడు, విరేచనాలకు మందు వేసుకున్న వారు వాడకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube