తాజాగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో కేవలం ఒకే ఒక్క అవార్డు టాలీవుడ్ ఇండస్ట్రీకీ లభించింది.దేశవ్యాప్తంగా దాదాపుగా 28 భాషల్లో విడుదలైన 300 కు పైగా చిత్రాల నుంచి నామినేషన్ వెళ్లగా, అందులో దాదాపు 20 సినిమాలు టాలీవుడ్‌వి ఉన్నాయి.
ఈ 20 చిత్రాలలో కేవలం ఒకే ఒక్క చిత్రానికి, అదీ కూడా ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేటగిరీలో అవార్డు రావడం ఏంటో ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న.అంటే 2022లో టాలీవుడ్ లో కార్తికేయ2 సి( Karthikeya 2 )నిమా ఒక్కటేనా? ఇంకా ఏ చిత్రం, ఏ డిపార్ట్‌మెంట్ వర్క్ జ్యూరీలకు నచ్చలేదా? అన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry ) గురించి ప్రపంచదేశాలు మాట్లాడుకుంటున్నాయి.భారతీయ చలనచిత్ర పరిశ్రమను తలెత్తుకునేలా చేసిన పరిశ్రమలో ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు.ఇతర పరిశ్రమల నటులు కూడా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తున్నారు.అలాంటిది, ఒకే ఒక్క అవార్డు రావడమంటే, ఇవ్వడమంటే ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు.కాగా గత ఏడాది ఉత్తమ నటుడు అవార్డుతో పాటుగా పలు కేటగిరీలలో దాదాపు 9 వరకు అవార్డ్స్ రాగా, ఈ సారి మాత్రం టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కటి పరిగణనలోకి తీసుకోవడం ఏంటి? ఏదైనా వివక్ష జరిగిందని భావించవచ్చా? లేదంటే టాలీవుడ్ పేరు టాప్‌లో ఉందని తట్టుకోలేకపోతున్నారా? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ కి మాత్రం ఈసారి అన్యాయం జరిగిందని చెప్పాలి.ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నామినేషన్ కు వెళ్లిన ఆ సినిమాలు ఏవి అన్న విషయానికి వస్తే.రైటర్ పద్మభూషణ్, సీతారామం, అంటే సుందరానికి, విరాటపర్వం, యశోద, రాధేశ్యామ్, సర్కారు వారి పాట, మర్రిచెట్టు, ఖుదీరాం బోస్, ఇట్లు మారేడిమిల్లి నియోజకవర్గం, కార్తికేయ2, డీజే టిల్లు, ఇక్షు, ధమాకా, చదువే నీ ఆయుధం, బింబిసార, భారత పుత్రుడు, ఎట్ లవ్, అశోకవనంలో అర్జున కళ్యాణం, అల్లూరి లాంటి సినిమాలు టాలీవుడ్ తరపున నామినేషన్ కు వెళ్లాయి.
మరి వీటిలో ఉత్తమ చిత్రాలు పక్కన పెడితే.ఏ ఇతర డిపార్ట్‌మెంట్ వర్క్ జ్యూరీకి నచ్చలేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.