ప్రముఖ మొబైల్ ఫోన్ల కంపెనీ సంస్థ శాంసంగ్ ( Samsung )మార్కెట్ లోకి ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకురాబోతోంది.శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ( Samsung Galaxy Z Fold 6 )స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేయనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే.ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్ ఫోన్ 7.6 అంగుళాల ప్రైమీ డిస్ ప్లే తో వస్తోంది.ఈ స్మార్ట్ ఫోన్ సెకండరీ స్క్రీన్ 6 అంగుళాలతో ఉంటుంది.ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది.స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్( Snapdragon 8 Gen 2 processor ) తో పని చేస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కూడిన అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.త్వరలోనే లాంచ్ చేసే అవకాశం ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.154999 గా ఉంది.ఇంత భారీ బడ్జెట్ లో ఉందంటే కేవలం ప్రీమియం యూజర్లను మాత్రమే టార్గెట్ చేసేందుకు శాంసంగ్ ఈ ఫోన్ ను తీసుకు రాబోతుందని తెలుస్తోంది.

అంతేకాదు శాంసంగ్ తాజాగా బడ్జెట్ వేరియంట్ లో ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకొచ్చే పనిలో ఉంది.ఈ ఫోల్డబుల్ ఫోన్ మాత్రం అందుబాటు ధరలోనే ఉండే అవకాశం ఉందట.ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో వేగంగా దూసుకెళ్ళడం కోసమే ముందుగా ఈ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.
ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన అన్ని శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు మొబైల్ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.త్వరలో మార్కెట్లో విడుదలయ్యే ఫోన్లు కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది.







