నిజామాబాద్ లో కవితకు పూర్తి స్థాయి చెక్ పెట్టే దిశగా అరవింద్

నిజామాబాద్ పార్లమెంటు స్థానం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పుత్రిక, మాజీ ఎంపీ కవితకు కంచుకోటగా ఉంటూ వస్తోంది.గత ఎన్నికల్లో ఎన్నికల హామీలలో భాగంగా నిజామాబాద్ లో అత్యధికంగా పండించే పసుపు రైతులకు మద్దతు ధర కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

 Arvind Aims To Put A Full Check On Poetry In Nizamabad/kavitha,dharmapuri Aravin-TeluguStop.com

కాని పసుపుకు మద్దతు ధర కల్పించకపోగా ఎంపీ కవిత ఉన్న సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని రైతులలో ఒక వ్యతిరేక అభిప్రాయం ఏర్పడింది.రాందేవ్ బాబా వారి పరిశ్రమతో కలిసి ఒప్పందానికి ప్రయత్నం చేసినా కూడా అది ఎంతవరకు సాధ్యపడలేదు.

అంతేకాక రైతులు ఇక మరల ఎన్నికలు వచ్చే సరికి చూసి అప్పటికీ పసుపుబోర్డు ఏర్పాటు కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఎంపీ కవితకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన పరిస్థితి ఉంది.దీంతో ఆ దెబ్బకు ఎంపీ కవిత భారీ ఓటమి చవి చూసింది.

బీజేపీ నుండి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ భారీ ఓట్లతో గెలుపొందాడు.ఆ తరువాతనే అసలు రాజకీయం మొదలైంది.

నిజామాబాద్ లో కవిత పట్టుగా ఉన్న చోట్ల కవిత ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఇప్పటికే రచించిన వ్యూహాలు ఫలప్రదమయ్యాయి.కాని ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిజామాబాద్ లో కవిత అనుకూల వాతావరణాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నాడు.

చూద్దాం భవిష్యత్తులో ఏం జరగనుందో.

Telugu @raokavitha, Kavitha, Nizamabad, Turmeric Board-Political .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube