పిల్లల బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉంటే చదువుల్లో అంత బాగా రాణిస్తారు.అలాగే ఆటపాటల్లో చురుగ్గా పాల్గొంటారు.
ప్రతి విషయం పట్ల ఎంతో పరిణితితో ఆలోచిస్తారు.అందుకే పిల్లల బ్రెయిన్ షార్ప్ గా మార్చేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తూనే ఉండాలి.
అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు ఎంతగానో సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే స్మూతీని పిల్లల డైట్ లో చేర్చితే గనుక వారి బ్రెయిన్ ఎంతో చురుగ్గా మరియు సమర్థవంతంగా పని చేస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు, వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఒక అరటి పండును తీసుకొని తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు స్లైసెస్, నానబెట్టుకున్న పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వేసుకోవాలి.
అలాగే అర కప్పు తరిగి పెట్టుకున్న పాలకూర, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్, ఒక గ్లాస్ ఆల్మండ్ మిల్క్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

తద్వారా మన సూపర్ టేస్టీ అండ్ హెల్తీ స్మూతీ సిద్దమవుతుంది.పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని కనుక ఇస్తే అందులో ఉండే పోషక విలువలు పిల్లల మెదడు చురుగ్గా పని చేసేందుకు సహాయపడతాయి.పిల్లల ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి రెట్టింపు చేస్తాయి.
అలాగే స్మూతీని పిల్లలకు ఇవ్వడం వల్ల వారు రోజంతా యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు.ఎముకలు, కండరాలు దృఢంగా ఎదుగుతాయి.
మరియు వివిధ రోగాలు సైతం వారి దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉంటాయి.