ఆ యాప్స్‌ గుడ్డిగా వాడేస్తున్నారా? ఆర్కా నివేదిక ఒకసారి చదవండి?

నేడు స్మార్ట్ ఫోన్ వాడని జనాలు మనకు కనపడనే కనపడరు.ఎందుకంటే అంతలా అది మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది కనుక.

 Arka Shocking Report Regarding Mobile Phone Apps Permissions Details, Apps, Andr-TeluguStop.com

అక్కడే వచ్చింది అసలు చిక్కు.నేటి టెక్నాలజీని వాడుకొని కొంతమంది కేటుగాళ్లు పెచ్చుమీరి పోతున్నారు.

జనాల ఉత్సుకతను క్యాష్ చేసుకుంటున్నారు.మీ చేతిలోని ఫోన్ మీ బండారాన్ని బట్టబయలు చేస్తుందంటే మీరు నమ్ముతారా? మీ ఫోన్ లో ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు మీ కదలికలను ట్రాప్ చేస్తున్నాయని మీకు తెలుసా? సదరు సమాచారం కనుక హ్యాకర్స్ చేతికి చిక్కితే.ఇక అంతే.మీరు రహస్యంగా వేసిన ప్రతీ అడుగు వారికి ఆయుధం అయిపోతుంది.

Telugu Android Apps, App, Apps, Arka Apps, Arka, Camera, Harmful Apps-Latest New

దీనికి ప్రధాన కారణం మీరు మీ మొబైల్ ఫోన్ లో స్టోర్ చేసుకున్న యాప్స్.అవును, వాటికి అడిగినన్ని పర్మిషన్స్ ఇచ్చేయడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అంటోంది ప్రముఖ అధ్యయన సంస్థ ఆర్కా. మొబైల్ యాప్స్, వెబ్ సైట్ల అధ్యయనం ఆధారంగా ఆర్కా ఓ రిపోర్టును తయారు చేసి, భయంకర విషయాలను బయట పెట్టింది.ఆఖరికి మీరు ఈ రోజు ఎక్కడ ఉన్నారు? ఎక్కడెక్కడ తిరిగారు? అన్న విషయాలు కూడా మీ ఫోన్ లోని యాప్స్ వలన తెలిసిపోతాయి అంటే మీరు నమ్మాల్సిందే.

Telugu Android Apps, App, Apps, Arka Apps, Arka, Camera, Harmful Apps-Latest New

అర్కా సంస్థ మొత్తం 200 మొబైల్ యాప్స్, వెబ్ సైట్స్ స్టడీ చేసి ఈ వివరాలను జనాలకోసం అందించింది.ఇందులో భారత్ లోని 25 రంగాలకు చెందిన వంద సంస్థలు.అమెరికా, యూరప్ లోని 76 సంస్థల్లో పని చేస్తున్న వారి నుంచి వివరాలు సేకరించడం విశేషం.ఆండ్రాయిడ్ ఫోన్స్ లో యాప్స్ అడుగుతున్న కెమెరా పర్మిషన్ ను చాలామంది ఓకే చేస్తున్నారని అది చాలా ప్రమాదమని సూచించింది.

అలాగే, IOS యాప్స్ లో 83శాతం మంది కచ్చితమైన లొకేషన్ కు యాక్సెస్ ను ఇస్తున్నారు.అలా చేయడం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది.యాప్ కు పర్మిషన్ ఇచ్చే సమయంలో ఒకటికి 10సార్లు ఆలోచించాలని, అవసరమైతే తప్ప యాప్స్ కు యాక్సెస్ ఇవ్వొద్దని అర్కా ఈ మేరకు సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube