తెలంగాణలో పరీక్షలు రద్దు..!!

తెలంగాణ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో జరగాల్సిన టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలను రద్దు చేయడం జరిగింది.రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 Tenth Inter Exams Cancelled In Telangana Corona, Telangana, Corona, Inter Exams-TeluguStop.com

ఇటీవల రాష్ట్రానికి చెందిన ఉన్నత అధికారులు కరోనా సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే రాష్ట్రంలో గత నెల 24వ తారీఖు నుండి విద్యాసంస్థలను క్లోజ్ చేయడం జరిగింది.

అయినా గాని ప్రస్తుతం కేసులు ఉన్న కొద్ది పెరుగుతూ ఉండటంతో టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలను వాయిదా వేయడం జరిగింది.టెన్త్ విద్యార్థులు 5.2 లక్షల మంది, ఇంట‌ర్ విద్యార్థులు నాలుగున్నర లక్షల మంది వరకు ఉన్నారు.ఇంటర్ పరీక్షలు మే1 నుంచి 20 వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17 నుంచి 26 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వాయిదా పడటం జరిగింది.

  మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల విషయంలో వాయిదా వేయటం జరిగింది.దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో.చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలను వాయిదా వేస్తూ ఉన్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగించే విధంగా ఉంది.

చాలా రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లు లోకి వెళ్లిపోతున్నాయి.కేవలం రోజుల వ్యవధిలో ఇండియాలో ఉన్న కొద్ది కేసులు పెరిగిపోవటం.

ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube