ఆ చెవి కమ్మలకు అంత పెద్ద కథ ఉందా? బామ్మా చెప్పిన కథ నెట్టింట వైరల్!

మనం కష్టపడి సంపాదిస్తే ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాం.మనం కష్టపడిన సొమ్ముతో ఇష్టపడిన వస్తువులు కొనుగోలు చేస్తే ఆ ఆనందమే వేరు.

 Workers Find Kerala Womans Gold Earrings That She Lost In Paddy Field 20 Years A-TeluguStop.com

అలాంటి వస్తువు ఉన్నట్టుండి మాయం అవుతే ఏంతో బాధ.అలా పోయిన వస్తువు మళ్లీ మనకు దొరికితే ఆ ఆనందమే వేరు.ఇంకా అలానే 20 ఏళ్ల క్రితం పొలంలో ప‌డి కొట్టుకుపోయాయి.

ఆ కమ్మలు ఇప్పుడు దొరకడంతో ఆమె ఆనందంలో మునిగి తేలింది.కేర‌ళ‌లోని కాస‌ర్‌గ‌ఢ్ జిల్లాలోని ఈడంపూడి గ్రామానికి చెందిన నారాయ‌ణి అనే మహిళ 20 ఏళ్ళ క్రితం చెవి కమ్మలను కొనింది.ఆ బంగారు కమ్మలు కొనేందుకు ఆమె దాదాపు 24 కిలోల బియ్యం అమ్మింది.

అది కూడా ఆమె కష్టార్జితం.

తన వరి పొలంలో పని చేస్తున్న సమయంలో కమ్మలు బురదలో పడిపోయాయి.

ఎంత వెతికినా సరే బంగారు కమ్మలు దొరకలేదు.కమ్మలు పోగొట్టుకోడంతో ఆమె చాలా బాధ పడింది.

అయితే ఇప్పుడు ఉపాధి కూలీలు ఆమె పొలంలో పనులు చేస్తున్నారు.మట్టిని తవ్వుతున్న సమయంలో ఓ కూలికి రెండు బంగారు కమ్మలు దొరికాయి.

ఉపాధి హామీ పనులకు ఆ వృద్ధురాలి కూతురు వెళ్లడంతో ఆమెకి చూపించగా అవి ఆమె తల్లివే అని చెప్పింది.ఆ వృద్ధురాలికి వెళ్లి చూపించాగా అప్పట్లో కష్టపడిన సొమ్ము ఇది.దీనికో పెద్ద కథ ఉందంటూ ఆనందం వ్యక్తం చేసింది.కాగా ఆ కమ్మలు అప్పట్లో 4,400 రూపాయలు కాగా ఇప్పుడు ఏకంగా 40 వేల రూపాయిలు పలుకుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube