సింబా రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

మురళీ మనోహర్ రెడ్డి( Murali Manohar Reddy ) దర్శకత్వం వహించిన తాజా చిత్రం సింబా( Simbaa ) ఈ సినిమాకు సంపత్ నంది కథని సమకూర్చిన విషయం తెలిసిందే.ఇందులో అన‌సూయ‌, జ‌గ‌ప‌తి బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు.

 Simbaa Movie Review, Simbaa, Simbaa Movie, Simbaa Movie Review, Tollywood , Sam-TeluguStop.com

కాగా ఈ సినిమా నేడు అనగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏమిటి?అన్న వివరాల్లోకి వెళితే.

కథ :

Telugu Anasuya, Jagapathi Babu, Muralimanohar, Sampath Nandi, Simbaa, Simbaa Rev

హైద‌రాబాద్ లో ఒక దారుణ హ‌త్య జరుగుతుంది.పోలీసులు రంగంలోకి దిగి ఆ కేసు గురించి చేదిస్తుండగా ఇంతలోనే మరొక హత్య జరుగుతుంది.ఇలా వరుస హత్యల వెనుక స్కూల్ టీచర్ అయిన అనుముల అక్షిక (అన‌సూయ‌)( Anasuya ), ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్ మాగంటి) ఉన్న‌ట్టు పోలీసులు నిర్ధారణకి వస్తారు.తర్వాత వారిద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు.

అలా వాళ్లిద్ద‌రినీ అంతం చేయ‌డానికి రంగంలోకి దిగిన మ‌రొకరు పోలీసుల ముందే హ‌త్య‌కు గుర‌వుతారు.ఈసారి ఈ అక్షిక‌, ఫాజిల్‌కు బెంగ‌ళూరు నుంచి వ‌చ్చిన ఇంకొక‌రు కూడా తోడై ఈ హ‌త్య‌లో పాలు పంచుకుంటారు.

హత్యలు చేసినప్పటికీ విచారణలో మాత్రం అమాయకులమని వారికి ఆ హత్యలకు ఎటువంటి సంబంధం లేదని చెబుతారు.ఇక హత్యలకు గురైన వారందరూ కూడా బిజినెస్ మాన్ పార్థ (క‌బీర్‌సింగ్‌) సంబంధీకులే.అయితే పార్థకి హత్యలు చేస్తున్న వారికి సంబంధం ఏమిటి? ఎందుకు వారిని చంపుతున్నారు? చివరికి వారికి శిక్ష పడిందా లేదా? ఈ విషయాల గురించి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడిగా మురళీ మనోహర్ కి సింబా మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా అన్ని క్రాఫ్ట్‌లను చక్కగా హ్యాండిల్ చేశాడు.తెరపై నటీనటుల నుంచి మంచి పర్ఫామెన్స్‌ ను రాబట్టుకున్నాడు.కథను తెరపై ఎంగేజింగ్‌గా మలిచాడు.ఈ సినిమాను చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు సినిమాలో లీనమయ్యేలా, పాత్రలకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాడు.దర్శకుడిగా మురళీ మొదటి అడుగులోనే విజయాన్ని సాధించినట్టుగా అనిపిస్తోంది.

ప‌రిశోధ‌న ప్ర‌ధానంగా సాగే ఒక సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ సినిమా అన్న‌ప్పుడు అందులోని క‌థ‌, క‌థ‌నాలు ఆస‌క్తిని రేకెత్తించాయి.ఫస్ట్ అఫ్ సెకండ్ హాఫ్ రెండు కూడా బాగానే ఉన్నాయి.

నటీనటుల పనితీరు :

Telugu Anasuya, Jagapathi Babu, Muralimanohar, Sampath Nandi, Simbaa, Simbaa Rev

జ‌గ‌ప‌తిబాబు( Jagapathi babu ), అన‌సూయ‌, శ్రీనాథ్ మాగంటి, అనీష్ కురువిల్లా ఇలా ఎవరి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు వారు బాగానే న‌టించారు.ఎప్పటిలాగే అనసూయ జగపతిబాబు వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా వ‌శిష్ఠ సింహా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తారు.విలన్ పాత్రలో న‌టించిన క‌బీర్ పాత్ర‌ కూడా బాగానే ఉంది.

సాంకేతికత :

Telugu Anasuya, Jagapathi Babu, Muralimanohar, Sampath Nandi, Simbaa, Simbaa Rev

టెక్నికల్ టీమ్ ను కూడా బాగానే వాడుకున్నాడు డైరెక్టర్ మురళీ.మంచి విజువల్స్, ఆర్ఆర్‌లతో తన సినిమాను బాగానే ప్రజెంట్ చేశాడు.సాంకేతిక విభాగాల్లో కృష్ణ‌ సౌర‌భ్ నేప‌థ్య సంగీతం, కృష్ణ‌ప్ర‌సాద్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తాయి.కొత్త దర్శకుడైనా కూడా ఆ అనుభవరాహిత్యం మాత్రం ఎక్కడా కనిపించలేదు.తొలి ప్రయత్నంలోనే మురళీ తన మేకింగ్ నాలెడ్జ్‌ను చూపించాడు.ఆయన మేకింగ్, టేకింగ్‌కు అందరినీ మెప్పిస్తుంది.నిర్మాణం కూడా బాగుంది.

రేటింగ్ : 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube