వీడియో: ప్రత్యర్థిపై విషప్రయోగం చేసిన రష్యన్ ఫిమేల్ చెస్ ప్లేయర్..!

ఇటీవల ఓ చెస్ టోర్నమెంట్‌( Chess Tournaments )లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది.ఒక ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్ తన ప్రత్యర్థిని విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించారు.

 Video: Russian Female Chess Player Who Poisoned Her Opponent Shocking Incident,-TeluguStop.com

అవును, మీరు చదివింది అక్షరాలా నిజమే.రష్యాలో జరిగిన చెస్ టోర్నమెంట్‌లో, 40 ఏళ్ల ఆమినా అబాకరోవా ( Amina Abakarova )అనే ప్లేయర్ తన 30 ఏళ్ల ప్రత్యర్థి ఉమయ్‌గనాత్ ఒస్మానోవాపై కోపం పెంచుకుంది.

ఆ కోపంతోనే ఆమినా తన ప్రత్యర్థి చెస్ బోర్డుపై పాదరసం (మెర్క్యురీ) చిలకరించింది.సీసీ కెమెరా ఈ దారుణాన్ని బట్టబయలు చేసింది.

పాదరసం తాకిన తర్వాత, ఉమయ్‌గనాత్‌కు తీవ్ర తల తిరుగుతున్నట్లు, వికారంగా అనిపిస్తున్నట్లు అనిపించింది.చెస్ ప్లేయర్ ఆమినా అబాకరోవా తన ప్రత్యర్థికి విషం ఇచ్చిన సంఘటనను ముందుగా న్యాయమూర్తి గమనించారు.ఆయన పోలీసులకు ఈ విషయం చెప్పిన తర్వాత, సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు.ఫుటేజ్‌లో ఆమినా నేరాన్ని స్పష్టంగా చూపిస్తున్న దృశ్యాలు కనిపించాయి.దీంతో ఆమినాను అరెస్టు చేశారు.కోర్టు తీర్పు ప్రకారం, ఆమినాకు 3 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

దాగెస్తాన్‌లోని క్రీడల శాఖ మంత్రి సజీదా సజీదోవా మాట్లాడుతూ, “ఇతరులలాగే నేను కూడా ఈ సంఘటనకు కారణం ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నాను.అంత అనుభవం ఉన్న ప్లేయర్ ఇలాంటి పని ఎందుకు చేసిందో నాకు అర్థం కావడం లేదు.ఆమినా చేసిన పని వల్ల అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ముప్పులో పడింది.చేసిన తప్పుకు ఆమినా శిక్ష అనుభవించాల్సిందే.” అని అన్నారు.ఆమినా అబాకరోవా తన నేరాన్ని ఒప్పుకుంది.

ఒక ప్రాంతీయ పోటీలో ఉమయ్‌గనాత్ ఒస్మానోవా చేతిలో ఓడిపోయిన కోపంతో ఆమెకు విషం ఇవ్వాలని ప్రయత్నించానని చెప్పింది.అంతేకాకుండా, ఉమయ్‌గనాత్ తన గురించి, తన బంధువుల గురించి చెడుగా మాట్లాడిందని ఆరోపించింది.

ఉమయ్‌గనాత్ ఇప్పుడు కోర్టు ఆమినాకు గరిష్ట శిక్ష విధించాలని కోరుతోంది.ఆమినా స్నేహితులు ఆమె ప్రవర్తన తమకు షాకిచ్చిందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube