ఈ రెండు వంట నూనెల‌ను వాడితే మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు!

ఇటీవ‌ల రోజుల్లో గుండె జ‌బ్బుల‌తో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య భారీ పెరిగిపోతోంది.అందుకే గుండె ఆరోగ్యంపై ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ‌ను వ‌హించాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

 Using These Two Cooking Oils Will Not Harm Your Heart Health! Rice Bran Oil, Ses-TeluguStop.com

అయితే గుండె ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేసే వాటిల్లో వంట నూనె ఒక‌టి.అందుకే గుండెకు మేలు చేసే నాణ్య‌మైన వంట నూనెల‌ను వాడాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంటారు.

అటు వంటి వాటితో త‌వుడు (రైస్ బ్రాన్ ఆయిల్‌) నూనె ఒక‌టైతే.మ‌రొక‌టి నువ్వుల నూనె.

ఈ రెండిటినీ వంట‌ల‌కు వాడితే మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు.

తవుడు నూనె, నువ్వుల నూనె.

ఈ రెండిటిలోనూ శాచురేటెడ్, మెనో అన్‌ శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌, ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్క‌లంగా ఉంటాయి.అందు వ‌ల్ల‌, ఈ రెండు నూనెల‌ను వంట‌త‌ల‌కు వాడితే గ‌నుక ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి.

మంచి కొలెడ‌స్ట్రాల్ పెరుగుతుంది.ఫ‌లితంగా గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే తవుడు, నువ్వుల నూనెల‌ను వంట‌ల‌కు వాడితే వాటిల్లో ఉండే కాల్షియం, జింక్ వంటి పోష‌కాలు ఎముక‌ల‌ను దృఢ‌ప‌రుస్తాయి.ఎముక‌ల వ్యాధులు రాకుండా ఉంటాయి.

కీళ్ల నొప్పుల స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.తవుడు, నువ్వుల నూనెల్లో పుష్ప‌లంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి క్యాన్స‌ర్‌కి కార‌ణం అయ్యే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశనం చేస్తాయి.

అంతే కాదు.తవుడు, నువ్వుల నూనెల‌ను వంట‌ల‌కు వాడితే గ‌నుక‌ ర‌క్త పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.చ‌ర్మంపై ముడ‌త‌లు త‌గ్గి ఎల్ల‌ప్పుడూ తేమ‌గా, య‌వ్వ‌నంగా మెరుస్తుంది.హెయిర్ ఫాల్ స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు సైతం మెరుగ్గా మారుతుంది.

Best Cooking Oils For Heart Health Cooking Oil

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube