ప్రపంచంలో నిద్రలేమి ( Insomnia )అన్నది మొత్తాన్ని ప్రభావితం చేసే సమస్య.అలాగే కొంతమందికి మంచం మీద పడుకున్నా నిమిషాల్లో నిద్రపోవడం కూడా ఒక బహుమతి.
మనల్ని ఆరోగ్యంగా చురుగ్గా ఉంచడానికి నిద్ర మన జీవితంలో ముఖ్యమైన భాగం.ప్రతి రాత్రి తగినంత నిద్రపోవడం వలన మొత్తం శ్రేయస్సుకు అవసరం.
నిద్ర లేకపోతే బరువు పెరగడం నుండి ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితుల( health conditions ) వరకు అనేక రకాలుగా ఒకరి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.రోజు రాత్రి బాగా నిద్రపోతున్నట్లయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం.
అలాగే కొన్ని అవాంఛిత అలవాట్లను కూడా మార్చుకోవడం మంచిది.
నిద్రలేమి సమస్యను కచ్చితంగా నివారిస్తూ చక్కటి నిద్రను పొందేందుకు కొన్ని చిట్కాలను పాటిద్దాం.అధిక ప్రకృతి కంటెంట్ కారణంగా చాలామంది వివిధ రకాల టీ, స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు.అలాగే పండ్లకు దూరంగా ఉంటారు.
కానీ నిద్ర శాస్త్రం మరోలా చెప్పడం జరిగింది ఒక నిర్దిష్ట పండు మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.అయితే అరటి పండ్లు తినడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
ఇందులో మెగ్నీషియం, పొటాషియం( Magnesium, potassium ) ఉంటాయి కాబట్టి ఇది మీరు బాగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది.ఈ ఖనిజాలు కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి.
అలాగే అరటిపండ్లలో ఉండే ట్రిప్టో పాన్ అనే అమైనో యాసిడ్ మెదడులో శాంత పరిచే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో కూడా సహాయపడుతుంది.
ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.అయితే అరటిపండు( banana ) మాత్రమే కాకుండా ద్రాక్ష, చెర్రీస్, స్ట్రాబెరీ( Grapes, cherries, strawberries ) లాంటివి పండ్లు కూడా మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి.అలాగే బాదం, చేపలు, తృణధాన్యాలతో చేసిన ఓట్స్ కేకులు కూడా నిద్రపోవడానికి బాగా సహాయపడతాయి.
అయితే నిద్రపోయే ముందు భారీ భోజనం తినడం వలన అసౌకర్యంగా, అజీర్ణం ఏర్పడుతుంది.అందుకే డిన్నర్ లో స్పైసీ ఫుడ్ ను నివారించాలి.అదేవిధంగా పాస్తా, బియ్యం లాంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలు యాసిడ్ నీ ఉత్పత్తిని చేస్తాయి.అలాగే పడుకునే ముందు చాక్లెట్ తినడం కూడా మానుకోవాలి.
వీటన్నిటిని మానుకొని కేవలం ఒక గ్లాసు పాలు తాగి పడుకున్న కూడా వెంటనే నిద్ర వస్తుంది.