ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల దృష్టి కన్నడ నుండి వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మీదనే ఉంది.2018 లో ఒక చిన్న సినిమాగా విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 1 ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో తెలిసిందే.ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాడు.ఇందులో ప్రతి ఒక్క సీన్ ఒక అద్భుతం అని చెప్పాలి.
అయితే ఇప్పుడు అందరిలో ఒకే సందేహం ఉంది.ప్రశాంత్ నీల్ తన మొత్తం కెరీర్ లో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు.
మొదటి సినిమా ఉగ్రం మొదలుకొని ఇప్పుడు రిలీజ్ అయిన కేజిఎఫ్ చాప్టర్ ౨ వరకు తన సినిమా ప్రయాణం చాలా తక్కువ.అయినప్పటికీ ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్నవాడిలా చేసిన టేకింగ్ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మొదటి సినిమా కన్నడ మూవీ అయినా, మిగిలిన రెండు సినిమాలు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో చిత్రీకరించి ప్రశంసలను అందుకున్నాడు.
ఈ సినిమాకు ఇప్పటికే ప్రేక్షకులు తీర్పు ఇచ్చేశారు, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ యశ్ నటనను మెచ్చుకుంటూ ప్రశాంత్ నీల్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇక ఈ సినిమా ఫలితంతో ప్రశాంత్ నీల్ పై మరింత బాధ్యత పెరిగింది.ఈయన నుండి మరొక సినిమా చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే.అందులోనూ బాహుబలి తర్వాత వరుసగా సాహూ, రాధే శ్యామ్ లతో పరాజయాలు అందుకుని నిరాశ పడిన ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ ను జరుపుకుంటోంది.ఈ సినిమా ఏ విధంగా ఉండనుంది అనే విషయంపై అందరికీ కొన్ని అంచనాలు ఉన్నాయి.
మరి ఆ అంచనాలను అందుకుంటాడో లేదో అన్నది తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.కాగా కేజిఎఫ్ చాప్టర్ 2 లో ప్రశాంత్ నీల్ చేసిన కొన్ని పొరపాట్ల గురించి కూడా చర్చ జరుగుతోంది.
అందులో ఒకటి హీరోయిన్ ఎంపిక.కేజిఎఫ్ సిరీస్ లో మామూలుగా హీరోయిన్ పాత్రకు అంత స్కోప్ లేదనే చెప్పాలి.
అయితే ఇక హీరో క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని చాప్టర్ 2 లో హీరోయిన్ కు కొంచెం ప్రాముఖ్యత ఇచ్చారు.అయితే మొదటి రెండు భాగాలలో హీరోయిన్ గా చేసిన శ్రీనిధి పట్ల బయట నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.మొదటి పార్ట్ అయితే పర్లేదు, కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం, సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరగడం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుని అయినా ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇందులో నటించిన శ్రీనిధి ఆ స్క్రీన్ కు వన్నె తీసుకురావడంలో విఫలం అయిందని అంటున్నారు.
ఇక సలార్ లో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ ను ఎపిక చేయగా ఫ్యాన్స్ అందుకు సంతృప్తిగా లేరని తెలుస్తోంది.ఇక అదే విధంగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీలో కూడా దీపికా పదుకొనెను హీరోయిన్ గా అనుకుంటున్నారు.
మరి దీపికా పదుకునే ఎన్టీఆర్ కు నప్పుతుందా అనే అనుమానాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి.మరి ఇక ముందు అయినా ప్రశాంత్ నీల్ హీరోయిన్ ల విషయంలో జాగ్రత్త పడతాడా చూడాలి.